Real hero actor sonusood helped Andhra Pradesh kurnool girl: రియల్ హీరో సోనుసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా సమయంలో చాలా మందికి ఆయన అండగా నిలిచారు. ప్రత్యేకంగా బస్సులు, వాహనాలు, విమానాలు, ట్రైన్ లలో కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని వారి గమ్యస్థానాలకే చేరేలా చేశారు. అంతేకాకుండా ఆక్సిజన్ కిట్స్ లు, కరోనా బాధితులకు సహాయం, పేదలకు నిత్యవసరాలు వంటివికూడా అందించారు. అంతేకాకుండా.. క్యాన్సర్, గుండెపోటు, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారికి కూడా ఉచితంగా ట్రీట్మెంట్ చేయించారు.
Thank you Devi for all the love. Study well.
Your college admission is done.
Let’s make this Andhra girl shine and make her family proud. Thanks @ncbn for the guidance.
बेटी पढ़ाओ बेटी बचाओ 🇮🇳 https://t.co/2JqbZXJHCn pic.twitter.com/Xh5c9Z8Ms6— sonu sood (@SonuSood) July 20, 2024
ఎందరో అభాగ్యులను సైతం ఆదుకున్నారు. మరేందరికో ఉన్నత చదువుల కోసం, ఇతరాత్ర సహాయాలు కూడా చేశారు.ఈ నేపథ్యంలో తాజాగా, ఏపీలోని యువతిని తన ఆపన్న హస్తం అందించి మరోమారు వార్తలలో నిలిచారు. దీంతో యువతి సోనుసూద్ చేసిన సహాయం పట్ల ఎమోషనల్ అయ్యింది. ఆయన చిత్రపటానికి పాలాభిషేకం సైతం చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్ కు చెందిన యువతికి సోనుసూద్ ఆపన్నహస్తం అందించాడు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బనవ నూరుకు చెందిన దేవి కుమారీ బీఎస్‌సీ చదవాలని ఎన్నో కలలు కంది. అయితే వాళ్ల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. ఉన్నత చదువులు చదువుకునేందుకు స్థోమత లేదు. దీంతో దేవీ కుమారీ అనే యువతి వీడియో తీసి.. తన ఉన్నత చదువులకు సహాయం చేయాలని అర్థించింది. దీంతో సోనుసూద్ ఆమెకు తన ఆపన్నహస్తం అందించారు. సదరు యువతికి.. ‘నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. కాలేజీకి వెళ్లడానికి సిద్ధంగా ఉండు’ అంటూ రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలో.. సోనుసూద్ టీమ్ ఆమె ఇంటికి చేరుకుని, ఉన్నత చదువుల కోసం అయ్యే ఖర్చులు మొత్తంవారే భరిస్తామని తెలిపారు. వాటి గురించి వివరాలు తీసుకొని వెళ్లినట్లు తెలుస్తోంది.
దీంతో యువతి కుటుంబం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన చదువు ఎక్కడ ఆపేయాల్సి వస్తుందో తీవ్రవేదనకుగురయ్యానని, సోనుసూద్ సర్.. వల్ల.. మరల చదువుకుంటున్నానని చెప్పి యువతి దేవీ కుమారీ ఎమోషనల్ అయ్యింది. సోనుసూద్ కు తన ధన్యవాదాలు చెప్పింది. ఆయన తనకు దేవుడితో సమానమని చెప్పుకోచ్చింది. ఈ క్రమంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం సైతం చేసింది.
Read more: UPSC Chairman: యూపీఎస్సీలో దుమారం.. చైర్మన్ రాజీనామా.. కారణం ఏంటంటే..?
ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఈ ఘటనను సోనుసూద్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసి.. ‘తన చూపించే ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. బాగా చదువుకోవాలని,జీవితంలో మంచిగా సెటిల్ అవ్వాలని కూడా సోను చెప్పారు. అదే విధంగా.. ఈ ఆంధ్రా అమ్మాయి జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకునే విధంగా చేయుత అందిద్దామని, ఆమె కుటుంబం గర్వపడేలా చేద్దామన్నారు. ఈ విషయంలో అందరికి మార్గదర్శకంగా నిలిచిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలని సోనూసూద్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల సోనూసూద్ హైదరబాద్ లోని కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ ను సైతం సందర్శించారు. ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి