Romantic MLCs: ఆ పార్టీనీ కొందరి నేతల వ్యవహారం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందంట. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు ఆదర్శంగా ఉండాల్సిన ఆ నేతల ప్రవర్తన పార్టీకీ పెద్ద తలనొప్పిగా మారిందట. ఒకటి తర్వాత ఒకటి వెలుగులోకి వస్తుండడంతో ఆ పార్టీ పరేషాన్ అవుతుందట. మగువ మోజులో పడి చీప్ గా బీహేవ్ చేస్తూ పార్టీనీ ఇరుకున పెడుతుండడంతో ఏం చేయాలో తోచక దిక్కు తోచని స్థితిలో ఆ పార్టీ పెద్దలు ఉన్నారట. ఇంతకీ అది ఏ పార్టీ ఆ లీడర్లు ఎవరు...? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ
ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకీ వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో అక్రమాలు చేశారంటూ ఇప్పటికే పలువురి నేతలపై కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు పార్టీలోని కొందరి నేతల వ్యవహారం కూడా వైసీపీనీ మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇటీవల వైసీపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆ పార్టీలోని కొందరి నేతల ప్రవర్తన చాలా చీప్ గా ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఆ పార్టీతో పాటు ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఏకంగా ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ వేరే మహిళతో కలిసి ఉండడం తీవ్ర కలకలం రేపింది. దువ్వాడ తీరుకు నిరసనగా ఆయన కుటుంబం మొత్తం రోడ్డు మీదకు వచ్చింది. రోజుల పాటు దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి, ఆయన కూతుళ్లు ఇంటి ముందే నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని ఆస్తిలో వాటా కావాలని డిమాండ్ చేశారు.దీంతో ఆ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెద్ద సెన్సేషన్ గా మారింది.
దువ్వాడ వ్యవహారం పెద్ద దుమారం రేపడంతో వైసీపీ పెద్దలు అప్రమత్తమయ్యారు. దువ్వాడ తీరుతో పార్టీకీ డ్యామేజ్ అవుతుందని గ్రహించిన వైసీపీ అధి నాయకత్వం దువ్వాడను పార్టీ నుంచి తప్పించింది. దువ్వాడ వ్యవహారంతో పార్టీకీ ఎలాంటి సంబంధం లేదని. అది కేవలం దువ్వాడ వ్యక్తిగత వ్యవహారం అని సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. భవిష్యత్తులో మరో నేత ఇలా ప్రవర్తించకుండా ఉండాలంటే దువ్వాడ మీద చర్యలు తీసుకోకతప్పని పరిస్థితి ఏర్పడింది. అంతే కాదు అటు అధికార పార్టీ వైసీపీనీ ఈ వ్యవహారంలో ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుండడంతో ముందు జాగ్రత్తగా దువ్వాడను పార్టీ నుంచి తప్పించింది. దీంతో దువ్వాడ వ్యవహారం నుంచి బయటపడ్డాం అని ఊపిరి పీల్చుకుంది.
ఇది ఇలా ఉండగానే తాజాగా మరో ఎమ్మెల్సీ తీరు వైసీపీనీ ఇబ్బందులకు గురి చేసేలా మారింది. ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఎమ్మెల్సీ అనంతబాబు ఓ మహిళపై ముద్దుల వర్షం కురిపిస్తున్నట్లు కనిపించింది. దీంతో ఈ వీడియో ఏపీలో పెద్ద సెన్షేషన్ గా మారింది. ఇప్పటికే అనంతబాబు ఒక మర్డర్ కేసులో జైలు జీవితం గడిపి వచ్చారు. మొదటి నుంచి కూడా ఈ ఎమ్మెల్సీ తీరు అంతా కూడా వివాదాస్పదమే. పార్టీకీ ఈ ఎమ్మెల్సీ పెద్ద తలనొప్పిగా మారాడని పార్టీలోనే ఒక చర్చ ఉంది. ఇలాంటి సమయంలో అనంతబాబు తాజా వీడియో ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతుంది. అసలు అనంత బాబు ఎమ్మెల్సీగా ఉండి ఈ చేష్టలు ఏంటి అని సొంత పార్టీ వారే ప్రశ్నిస్తున్నారు. అసలే ఒక వైపు అవకాశం దొరికితే అధికార పార్టీ ఇబ్బంది పెట్టాలని చూస్తుంటుంటే ఈ నేతల తీరు పార్టీకీ మరింత డ్యామేజీ చేసేలా ఉన్నాయి. దువ్వాడను పార్టీ నుంచి తప్పించిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు అనంతబాబు విషయంలో ఏం చేయబోతుందా అనే ఆసక్తికరంగా మారింది.
మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది వైసీపీ. ఈ ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అధికార పార్టీనీ ఎదుర్కోవడం కష్టం. అందునా వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. సాక్షాత్తు అధినేత జగన్ కూడా అసెంబ్లీకీ వెళ్లడానికి ససేమిరా ఇష్టపడడం లేదు . అలాంటి వైసీపీ అధికార పార్టీనీ ఇబ్బంది పెట్టే ఏకైక అవకాశం మండలి. మండలిలో వైసీపీకీ మెజార్టీ సభ్యులు ఉండడంతో కూటమి సర్కార్ ను ధీటుగా ఎదుర్కోచ్చు అని వైసీపీ అధిష్టానం భావించింది. కానీ అధిష్టానం ఆలోచనకు భిన్నంగా ఎమ్మెల్సీల తీరు ఉంది. చిలిపి చేష్టలతో పార్టీ పరువును గంగ పాలు చేస్తున్న ఎమ్మెల్సీల తీరుపై జగన్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే అధికార పార్టీ అవకాశం దొరికితే పార్టీనీ ఇరుకున పెట్టాలని చూస్తుంటే ఈ ఎమ్మెల్సీలు ఇలా చేయడం ఏంటిరా బాబు అని వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఎమ్మెల్సీల తీరుపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండడంతో తప్పని పరిస్థితుల్లో ఇలాంటి మరక పడిన నేతలను వదులుకునేందుకు సిద్దమవుతుంది.
మొత్తంగా మండలిలో ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సిన వైసీపీ ఎమ్మెల్సీలు తమ తుంటరి చేష్టలతో వ్యక్తిగతంగా నవ్వులపాలవుతున్నారు.ఎమ్మెల్సీల తీరుతో వైసీపీ పార్టీ పరువు కూడా బజారుపాలవుతుంది. అసలే అధికారం కోల్పోయిన వైసీపీకీ ఎమ్మెల్సీల ప్రవర్తన మరింతగా ఇబ్బందిపెట్టేలా మారింది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.