Andhra Pradesh: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు: వైకాపా అభ్యర్థులను ప్రకటించిన సజ్జల!

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం, ఓసీలకు 50 శాతం సీట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2021, 06:21 PM IST
Andhra Pradesh: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు: వైకాపా అభ్యర్థులను ప్రకటించిన సజ్జల!

YCRCP MLC Candidates: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక(local body quota mlc elections)ల్లో పోటీ చేసే అభ్యర్థులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) ప్రకటించింది. అభ్యర్థుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిరెడ్డి (sajjala ramakrishna reddy) శుక్రవారం వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50శాతం సీట్లు కేటాయించినట్లు చెప్పారు. 14 స్థానాల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు 7 స్థానాలు, ఓసీలకు 7 స్థానాల్లో అవకాశం కల్పించినట్టు చెప్పారు.

ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
విజయనగరం జిల్లా నుంచి రఘురాజు, విశాఖపట్నం నుంచి ఒరుదు కల్యాణి, వంశీ కృష్ణ యాదవ్‌, తూర్పు గోదావరి జిల్లా నుంచి అనంత బాబు, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురామ్‌, మొండితోక అరుణ్ కుమార్‌, గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, ప్రకాశం జిల్లా నుంచి మాధవరావు, అనంతపురం జిల్లా నుంచి వై.శివరామిరెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి భరత్‌ను సీఎం జగన్‌(CM Jagan) ఎంపిక చేసినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Also Read: AP, TS ministers: తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య మాటల తూటాలు

ఏపీ గురించి తెలంగాణ మంత్రులకెందుకు?
‘''బిచ్చమెత్తుకుంటున్నామని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి(Telangana Minister Prashant Reddy) అనడం సరికాదు. కేంద్ర నిధులు రాష్ట్రాల హక్కు అని కేసీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ మాటలు ఆయన మంత్రులు వినలేదేమో. కేంద్ర నిధుల సాధనలో ఒక్కో రాష్ట్రానిది ఒక్కో పద్ధతి. ఏపీ ఎలా పోతుందో తెలంగాణ మంత్రులకు ఎందుకు?''’’ అని సజ్జల వ్యాఖ్యానించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News