ఎన్నికల వేళ ఏపీలో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్ నాథ్ నియామకం జరిగింది. అలహాబాద్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ విషయంలో సుప్రీంకోర్టు కొలిజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పడిన ఏపీ హైకోర్టుకు ప్రస్తుతం జస్టిస్ ప్రవీణ్ కుమార్ తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా వ్యవహరిస్తున్నారు. విక్రమ్ నాథ్ బాధ్యతలు స్వీకరించే వరకు ప్రవీణ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.
జస్టిస్ విక్రమ్ నాథ్ ప్రస్థానం..
విక్రం నాథ్ 1986లో లా డిగ్రీ పుచ్చుకున్నారు. 1987 నుంచి అలహాబాబాద్ లో లా ప్రాక్టిస్ చేశారు. ఇలా కెరీర్ ను కొనసాగిస్తూ అంచెలంచెలుగా ఎదిగి.. 2004లో అలహాబాద్ హైకోర్టుకు అడిషనల్ జడ్జిగా ప్రయోట్ అయ్యారు. 2006 అలహాబాద్ హైకోర్టు పర్మినెంట్ జడ్డిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి న్యాయమూర్తిగా కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో సీనియర్ జడ్జిగా వ్యహరిస్తున్న ఆయన తాజాగా ఏపీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా నియమితులయ్యారు
సుప్రీం కొలజియం కీలక నిర్ణయ ాలు..
ఇదే సందర్బంలో సుప్రీంకోర్టు కొలిజియం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కేరళ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి పీఆర్ రామచంద్ర మీనన్ ను ఛత్తీస్ గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది. పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తి ఏకే మిట్టల్ ను మేఘాలయ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.