AP: మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, తొలి ఫైలుపై సంతకం

రాష్ట్ర మంత్రిగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కేటాయించిన ఛాంబర్లో ప్రవేశించారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jul 26, 2020, 02:12 PM IST
AP: మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, తొలి ఫైలుపై సంతకం

అమరావతి : ఏపీ పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఏపీ కేబినెట్ విస్తరణలో మంత్రివర్గంలోకి సీదిరి అప్పలరాజును తీసుకున్నారు. అయితే తనకు మంత్రిగా అవకాశం కల్పించిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (AP CM YS Jagan) నమ్మకాన్ని నిలబెడతానని మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. బతకాలని లేదు, చచ్చిపోతానంటూ నటి పోస్ట్.. ఆపై!

పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా సీదిరి అప్పలరాజు ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. ఆక్వా కల్చర్ కొత్త అధారిటీ ఏర్పాటు ఫైలుపై తొలి సంతకం చేశారు. ప్రత్యేకంగా ఆక్వా అథారిటీ ఉంటేనే ఆక్వా రంగానికి చేయుత ఉంటుందన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ.700 కోట్లు కేటాయించారని తెలిపారు. అమూల్‌తో ఇదివరకే ఒప్పందం కూడా చేసుకున్నామని స్పష్టం చేశారు. బికినీలో టైటిల్ నెగ్గిన నటి హాట్ హాట్‌గా..
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

Trending News