Pawan Kalyan Convoy: వీఐపీల రాకపోకలతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. రోడ్డుకు అడ్డంగా పెట్టిన కాన్వాయ్ వలన సకాలంలో వైద్యం అందక ఓ నిండు ప్రాణం పోయింది. అంబులెన్స్‌లో సీపీఆర్ చేసినా ప్రాణం నిలవలేదు. ఫలితంగా పవన్ కల్యాణ్‌పై మృతుడి కుటుంబసభ్యులు, స్థానకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా కాన్వాయ్ పెట్టడంతోనే తమ వ్యక్తి మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన గుంటూరులో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Chandrababu: దళితులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. ఏం చెప్పారో తెలుసా?
గుంటూరులో అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. గుంటూరులోని అటవీ శాఖ కార్యాలయానికి ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ విచ్చేశారు. అయితే దాదాపు 20కి పైగా డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఉండడంతో వాటిని రోడ్డుపైనే నిలిపి ఉంచారు. ఈ సమయంలో ఓ వ్యక్తి అస్వస్థతకు గురవడంతో అంబులెన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆ మార్గంలో వచ్చింది. రోడ్డుకు అడ్డంగా కాన్వాయ్ నిలిపి ఉంచడంతో ముందుకు కదలలేని పరిస్థితి.
Also Read: YS Sharmila: వర్రా రవీంద్రా రెడ్డి అనే సైకో నా పుట్టుకను అవమానించాడు: వైఎస్ షర్మిల
అంబులెన్స్ వచ్చిన విషయాన్ని గ్రహించిన భద్రతా సిబ్బంది రోడ్డుపై నిలిపి ఉంచిన వాహనాలను తప్పించేందుకు దాదాపు పది నిమిషాల సమయం పట్టింది. అంబులెన్స్‌లో అస్వస్థతకు గురయిన అతడి పరిస్థితి విషమిస్తోంది. కాన్వాయ్ వాహనాలు పక్కకు తీస్తుండడంతో అంబులెన్స్‌లోని సిబ్బంది రోగికి సపర్యలు చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా రోగి ప్రాణాలు కాపాడేందుకు సీపీఆర్ చేశారు. అయినా కూడా అతడు కోలుకోలేదు. రోడ్డుపై అడ్డంగా నిలిపి ఉంచిన డిప్యూటీ సీఎం కాన్వాయ్ వాహనాలు ఆలస్యంగా పక్కకు జరిపి దారి ఇవ్వడంతో సమయం ఆలస్యమైంది. ఫలితంగా రోగి అంబులెన్స్‌లోనే మృతి చెందాడు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగిని సకాలంలో ఆస్పత్రికి తరలించి ఉంటే అతడు బతికేవాడని కుటుంబసభ్యులు తెలుపుతున్నారు. చిలకలూరిపేట కొమ్మినేని ఆస్పత్రి నుంచి అంబులెన్స్ గుంటూరులోని శ్రేష్ట వైద్యశాలకు వెళ్తోంది. ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ వాహనాలు అడ్డు లేకుంటే రోగి ప్రాణాలు దక్కేవని అంబులెన్స్ సిబ్బంది చెబుతున్నారు. డిప్యూటీ సీఎం కాన్వాయ్ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందడంతో సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీఐపీలు ప్రజల రక్షణకు ఉండాలి గానీ ప్రజల ప్రాణాలు తీసేలా ఉంటారా? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ సంఘటనపై అదనపు ఎస్పీ స్పందిస్తూ.. ప్రచారం జరుగుతన్న విషయం తప్పు అని చెప్పారు. 'అంబులెన్స్‌కు ఎవరు.. ఎలాంటి ఆటంకం కలిగించలేదు. మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదు' అని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.