ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు సంగతేమో గానీ ప్రముఖ సింగర్ అద్నాన్ సమీపై విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అద్నాన్ సమీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే..
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు జెండాను రెపరెపలాడించారని ప్రశంసించారు. తెలుగువాడికి ఇది గర్వ కారణమని, మూవీ యూనిట్ చూసి గర్వపడుతున్నామని కామెంట్ చేశారు.
అతిగా స్పందించిన అద్నాన్ సమీ
ఈ వ్యాఖ్యలపై ఎందుకో తెలియదు గానీ ప్రముఖ సింగర్ అద్నాన్ సమి అతిగానే స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి వ్యాఖ్యల్లో తెలుగు పతాకం అనడం ఆయనకు నచ్చలేదట. ముందు మనం భారతీయులమని..తెలుగు అంటూ దేశంలో వేరు చేయడం ఆపాలని అద్నాన్ సమీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు. అంతర్జాతీయంగా మనం ఒకే దేశం వాళ్లమని..వేర్పాటువాద వైఖరి 1947 నుంచి నుంచి చూస్తున్నామన్నారు.
మా దేశభక్తి గురించి చెప్పేందుకు నీవెవరు
అద్నాన్ సమీ వ్యవహారంపై మంత్రులు గుడివాడ అమర్నాథ్, విడదల రజని, వైసీపీ తిరుపతి ఎంపీ తదితరులు ఎదుురుదాడి చేశారు. సొంత రాష్ట్రానికి, భాషకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంపై గర్వించడం, దేశభక్తిని తగ్గించదని స్పష్టం చేశారు. దీన్ని వేర్పాటువాద అనరన్నారు. అతిగా ఆలోచించకుండా దేశానికి మరో గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించేలా కృషి చేయాలని సూచించారు. అసలు తెలుగువాళ్ల దేశభక్తిపై తీర్పు ఇవ్వడానికి మీరెవరంటూ ప్రశ్నించారు. తెలుగువాళ్లమని మళ్లీ మళ్లీ ఉద్ఘాటిస్తున్నామన్నారు.
Also read: Nagababu Strong Comments : ఎదవ, సన్నాసి..అవసరం కోసం ఎంతకైనా దిగజారుతాడు..వర్మపై రెచ్చిపోయిన నాగబాబు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook