Snake hulchul at MP Rammohan Naidu house: శ్రీకాకుళంలోని (Srikakulam) ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇంటి ఆవరణలో రక్తపింజర పాము కలకలం రేపింది. విషపూరితమైన ఆ రక్తపింజర (Rakta Pinjari) భయంకరంగా బుసలు కొడుతూ హడలెత్తించింది. దీంతో ఎంపీ నివాసంలోని సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే గ్రీన్ మెర్సీ స్నేక్ హెల్ప్ లైన్‌కు సమాచారం అందించగా.. ఆ సిబ్బంది అక్కడి చేరుకుని పామును పట్టుకున్నారు.
శ్రీకాకుళం (Srikakulam) నగరంలోని 80 ఫీట్ రోడ్డులో రామ్మోహన్ నాయుడు (MP Rammohan Naidu) నివాసం ఉంది. మంగళవారం (డిసెంబర్ 21) ఉదయం ఇంటి ఆవరణలో రక్తపింజరను సిబ్బంది గుర్తించారు. ఆ సమయంలో అది భయంకరంగా బుసలు కొడుతూ కనిపించడంతో సిబ్బంది భయపడిపోయారు. వెంటనే గ్రీన్ మెర్సీ స్నేక్ హెల్ప్ లైన్‌కు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు.
కాసేపటికి అక్కడికి చేరుకున్న హెల్ప్ లైన్ నిర్వాహకులు చాకచక్యంగా ఆ పామును (Snake) సంచిలో బంధించారు. దీంతో అక్కడి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. గ్రీన్ మెర్సీ స్నేక్ హెల్ప్ లైన్ సిబ్బంది... ఆ పామును సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు.
Also Read: జరక్క జరక్క లేటు వయసులో ఆ బ్రహ్మచారికి పెళ్లి... ఇంతలోనే ఊహించని షాకిచ్చిన నవ వధువు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Snake: ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇంట్లో రక్తపింజర కలకలం-భయంకరంగా బుసలు కొట్టిన పాము
ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇంట్లో పాము కలకలం
భయంకరంగా బుసలు కొట్టిన పాము
పామును బంధించి తీసుకెళ్లిన గ్రీన్ మెర్సీ స్నేక్ హెల్ప్ లైన్ నిర్వాహకులు