కొత్త ఏడాదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త కొత్త హైకోర్టు కొలువుదీరింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు న్యాయమూర్తుల చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు హజరయ్యారు
హైకోర్టు విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటైన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి ఈ రోజు నుంచి ఇరు రాష్ట్రాల్లో హైకోర్టులు తమ విధులను ప్రారంభించనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తుండగా..ఏపీ హైకోర్టు నిర్మాణ దశలో ఉన్నందున తాత్కాలికంగా సీఎం క్యాంపు కార్యాలయంలో కోర్టు కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు.