Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వివాదంగా మారిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న  దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Written by - Srisailam | Last Updated : Sep 26, 2022, 02:59 PM IST
  • వివేకా హత్య కేసులో ట్విస్ట్
  • శివశంకర్ రెడ్డికి చుక్కెదురు
  • బెయిల్ పిటిషన్ కొట్టివేత
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వివాదంగా మారిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న  దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బెయిల్ విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో  చేసుకోబోమని జస్టిస్ ఎం.ఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం స్పష్టం చేసింది. శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.  శివశంకర్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు.

సాక్ష్యాలు తారుమారు చేస్తారనే అభియోగాలు ఉన్నాయని ధర్మాసనం చెప్పగా.. అలా అనేందుకు ఎక్కడా ఆధారాలు లేవని సింఘ్వి చెప్పారు. ఈ కేసులో ఎక్కడా శంకర్ రెడ్డి పేరు ప్రస్తావించలేదని తెలిపారు. అప్రూవర్ గా మారిన వాళ్ళు కూడా శివశంకర్ రెడ్డి పేరు చెప్పలేదని న్యాయవాది వాదించారు. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ లో కూడా ఆయన పేరు చేర్చలేదని వివరించారు. ఈ కేసులో ఏ1గా నిందితుడిగా ఉన్న వ్యక్తికి మూడు నెలల్లో బెయిల్ ఇచ్చారన్న అభిషక్ మను సింఘ్వి..  11 నెలలు అవుతున్నా, ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం లేదని వాదించారు. ఇప్పుడీ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయించాలని చూస్తున్నారని.. వెంటనే శివశంకర్ రెడ్డి బెయిల్ ఇవ్వాలని విన్నవించారు. సింఘ్వీ వాదనల అనంతరం స్పందించిన ధర్మాసనం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ధర్మాసనం తిరస్కరించింది. శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేసేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని తెలిపింది.

వివేకానంద రెడ్డి హత్య కేసులో వారం రోజులో క్రితమే మరో కీలక పరిణామం జరిగింది. తమకు ఏపీలో నిర్వహిస్తున్న విచారణపై నమ్మకం లేదని.. దర్యాప్తు సంస్థ అధికారులు సాక్ష్యులను బెదిరిస్తున్నారని.. కాబట్టి ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరింది. సునీత పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణమురారి ధర్మాసనం.. సీబీఐ, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే నెల 14న చేపట్టనుంది.

Also read: Jagga Reddy: జగన్, షర్మిల బీజేపీ వదిలిన బాణాలే..ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Also read: Portable Marriage Hall: వావ్ అనిపిస్తున్న కదిలే కల్యాణ మండపం.. ఆనంద్‌ మహీంద్రా ఫిదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News