vizag steel: విశాఖ ఉక్కు (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్‌ఐఎన్‌ఎల్) కొనుగోలుపై దేశీయ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ ఆసక్తిగా ఉంది. ఆ విషయాన్ని టాటా స్టీల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో), మేనేజింగ్ డైరెక్టర్ టి.వి. నరేంద్రన్(tv narendran) ధ్రువీకరించారు.
విశాఖలోని ఆర్‌ఐఎన్‌ఎల్(RINL)కు 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉంది. ఈ సంస్థలో 100 శాతం వాటాను విక్రయించడానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ జనవరి 27న సూత్రపాయ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థల ప్రయివేటీకరణ వాటాల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల నిధులు సమకూర్చుకోవాలని మోడీ(PM Modi) ప్రభుత్వం బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.
Also Read: AP Vs Odisha :ఆంధ్రా– ఒడిశా మధ్య ముదురుతున్న సరిహద్దు వివాదం...కొఠియా గ్రామాల్లో అసలేం జరుగుతోంది?
ఆర్‌ఐఎన్‌ఎల్(RINL)కు 22,000 ఎకరాల భూమి ఉంది. గంగవరం(Gangavaram Port) పోర్టు దగ్గర కావడంతో.. కోకింగ్ కోల్ వంటి ముడి పదార్థాలను సులువుగా రవాణా చేసే అవకాశం ఉంది. విశాఖ ఉక్కు భారత తూర్పు తీరంలో ఉండటం వల్ల టాటా స్టీల్(TATA Steel) దీనిని టేకోవర్ చేస్తే.. ఆగ్నేయాసియా మార్కెట్లకు సులువుగా ఎగుమతులు చేయగలదు. ఇప్పటికే ఆయా దేశాలకు ఆ కంపెనీ ఎగుమతులు చేస్తోంది.
మరోవైపు ఒడిశా(Odisha) కేంద్రంగా ఉన్న నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ (ఎన్‌ఐఎన్‌ఎల్) కొనుగోలు కోసం కూడా టాటా గ్రూప్‌లో భాగమైన టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్ ఆసక్తి వ్యక్తీకరణ పత్రం (ఈవోఐ) దాఖలు చేసినట్లు నరేంద్రన్ చెప్పారు. ఎన్‌ఐఎన్‌ఎల్(NINL) అనేది ఒక సంయుక్త సంస్థ. ఇందులో నాలుగు ప్రభుత్వ రంగ కంపెనీ (ఎమ్‌ఎమ్‌టీసీ, భెల్, ఎన్‌ఎమ్‌డీసీ, మెకాన్)లతో పాటు రెండు ఒడిశా ప్రభుత్వ కంపెనీలకు వాటాలున్నాయి. ఈ కంపెనీలో వాటా విక్రయాలకూ కేంద్రం ఇదివరకే సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook