మూడేళ్లలో ఎన్నికలు - చంద్రబాబు జోస్యం

టీడీపీ న్యాయ విభాగ ఆత్మీయ సదస్సులో చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు

Updated: Sep 10, 2019, 06:11 PM IST
మూడేళ్లలో ఎన్నికలు - చంద్రబాబు జోస్యం

అమరావతి: రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రస్తావిస్తూ వైఎస్ జగన్ సర్కార్ పై  చంద్రబాబు షెటైర్లు సంధించారు . ఈ రోజు నిర్వహించిన టీడీపీ న్యాయ విభాగ ఆత్మీయ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ  రాష్ట్రంలో చేపడుతున్న రివర్స్ టెండరింగ్ తరహా రివర్స్ ఎన్నికలు వస్తే బాగుటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ రివర్స్ ఎన్నికలు వచ్చే అవకాశమైతే లేదు కానీ.... మూడేళ్లలో జమిలి ఎన్నికలు వస్తాయని  జోస్యం చెప్పారు. 

ఒకే దేశం -ఒకే ఎన్నికలు నినాదాన్ని వినిపిస్తున్న మోడీ సర్కార్ ..జమిలి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ఉందనే విషయం బహిరంగ రహస్యమే. వాస్తవానికి  తాజాగా ముగిసిన ఎన్నికల సమయంలో జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చినప్పటికీ.... రాష్ట్రాల అభ్యంతరాలు, వివిధ రకాల కారణాల వల్ల  అది అమలుకు నోచుకోలేదు.

ఇప్పుడు గతంలో కంటే బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నందున జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశముందని రాజకీకయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు చెప్పినట్లు మూడేళ్లలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే జగన్ సర్కార్ ఎన్నికలు ఎదుర్కొవాల్సి వస్తుంది.