సీఈసీని కలిసిన టీడీపీ బృందం; బదిలీలపై వివరణ కోరిన నేతలు

                    

Last Updated : Mar 27, 2019, 06:45 PM IST
సీఈసీని కలిసిన టీడీపీ బృందం;  బదిలీలపై వివరణ కోరిన నేతలు

రాష్ట్రంలో ఐబీ చీఫ్,ఎస్పీల బదిలీలను వ్యతిరేకిస్తూ ఉద్యమించేందుకు టీడీపీ సిద్ధమౌతుంది. ఈ క్రమంలో టీడీపీ బృందం కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాను కలిసింది. విచారణ లేకుండా రాష్ట్రంలోని ఉన్నాధికారులను ఎలా బదిలీ చేశారంటూ ఈసీని ప్రశ్నించారు. ఎన్నికలతో సంబంధంలేని అధికారులను బదిలీ చేయడాన్నిటీడీపీ బృందం తప్పుబట్టింది . ఈసీ పరిధిలోకి రానటువంటి అధికారులను ఎలా బదిలీ చేస్తారని టీడీపీ ప్రశ్నించింది. రాష్ట్రంలో చేపట్టిన బదిలీల విషయంలో వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ బృందం కోరింది.

సీఎంకు ఏదైన జరిగితే ఎవరు బాధ్యులు ?
ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ  రాష్ట్రంలో జరిగిన ఉన్నతానికారుల బదిలీలపై  వివరణ ఇవ్వాలని సీఈసీని కోరామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమచారం ఇవ్వకుండా బదిలీలపై నిర్ణయం తీసుకోవడం అన్యాయమన్నారు.  ముఖ్యమంత్రి భద్రతను చూసే ఇంటెలిజెన్సీ చీఫ్ ను బదిలీ చేశారు.. అనుకోని విధంగా రాష్టంలో ఏమైన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని జూపూడి ప్రభాకర్ ప్రశ్నించారు. బదిలీ చేశారు సరే..ఇప్పుడు  ముఖ్యమంత్రి భద్రతనను ఎవరికి అప్పగిస్తారు అంటూ  ప్రశ్నించారు. ఇలాంటి ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని ఈసీని కోరినట్లు తెలిపారు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన ఎన్నికల  కమిషన్ ఈ విషయంలో పునారాలోచన చేయాలని కోరినట్లు జూపడి తెలిపారు. 

Trending News