రానున్న 48 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. అంతేకాకుండా రానున్న 5 రోజులపాటు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా లేకపోలేదని వాతావరణ కేంద్రం స్పష్టంచేసింది. గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా చెదురుముదురు జల్లులు కురవగా తెలంగాణలో పొడి వాతావరణం నెలకొని వుంది. నిజామాబాద్‌లో 41 డిగ్రీల అత్యధిక సెల్సియస్‌ల ఉష్ణోగ్రతలు నమోదవగా మెదక్‌లో అత్యల్పంగా 22 డిగ్రీల సెల్సియస్‌ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతల వివరాలకొస్తే, కర్నూలు, నంద్యాలలో అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్‌ల ఉష్ణోగ్రతలు నమోదవగా జంగమహేశ్వరపురంలో అత్యల్పంగా 20 డిగ్రీల సెల్సియస్‌ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.