హైదరాబాద్: చాంద్రాయణగుట్ట బీజేపీ అభ్యర్థి షహజాదీకి ప్రభుత్వం గట్టి భద్రతను కల్పించింది. ఆమెకు ఇద్దరు గన్ మెన్లను కేటాయిస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రచారానికి దిగితే దాడిచేస్తామని కొందరు దుండగులు హెచ్చరించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన పోలీసు శాఖ ఈ మేరకు ఆమెకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసింది.
చంద్రయాణగుట్టలో ఐఎంఎం అభ్యర్ధిగా అక్బరుద్దీన్ ఓవైసీ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు పోటీగా మైనార్టీ సామాజికవర్గానికి చెందిన షహజాదీని బీజేపీ రంగంలోకి దించింది. ఈ నియోజకవర్గంలో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కమలం పార్టీ తమ అభ్యర్ధి షహజాదికి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తోంది.
పార్టీ నుంచి అందుతున్న సహాయ సకహారాలతో షహజాదీ నియోజకవర్గ ప్రచార పర్వంలో దసుకుపోతుంది. ప్రతి వీధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఎంఐఎం పార్టీ, అక్బరుద్దీన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మహిళల అక్రమ తరలింపు, నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితిపై ప్రశ్నలు సంధిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకు బెదిరింపులు కాల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పోలీసులను ఆశ్రయించి భద్రత కోరారు. తాజా ఘటనతో ఓల్డ్ సిటీ రాజకీయం మరింత వేడెక్కింది.