Margadarsi Case: మార్గదర్శి సంస్థలపై ఏపీ సీఐడీ ఇటీవలికాలంలో సోదాలు నిర్వహిస్తోంది. ఈ కేసులో ఏ1 రామోజీరావు, ఏ2 శైలజా కిరణ్‌లను విచారించి కీలక విషయాలు సేకరించింది. ఏప్రిల్ 13న అంటే రేపు మరోసారి శైలజా కిరణ్‌ను విచారించనుంది.
మార్గదర్శిపై ఏపీ సీఐడీ జరుపుతున్న సోదాలను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మార్గదర్శి సంస్థ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ విధమైన పిటీషన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా బెంచ్ ముందు ప్రస్తావించడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని హైకోర్టుకు వివరించింది. ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదననలను పరిగణలో తీసుకున్న తెలంగాణ హైకోర్టు సీఐడీ సోదాల్ని ఆపేలా ఏవిధమైన ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
తెలంగాణ హైకోర్టు ఆదేశాల నేపధ్యంలో ఏపీసీఐడీ దూకుడు మరింతగా పెంచింది. ఇప్పటికే రామోజీరావు, శైలజా కిరణ్‌లను విచారించిన ఏపీ సీఐడీ మరోసారి విచారణకు రావల్సిందిగా శైలజా కిరణ్‌కు నోటీసులు జారీ చేసింది. రేపు అంటే ఏప్రిల్ 13న అమరావతిలోని సీఐడీ కార్యాలయానికి రావల్సిందిగా నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపధ్యంలో రేపటి సీఐడీ విచారణ ఆసక్తి రేపుతోంది.
మరోవైపు చిట్ ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించి డిపాజిటర్ల సొమ్మును నిబంధనలకు వ్యతిరేకంగా ఇతర సంస్థల్లోకి సొమ్ములు మళ్లించిన వ్యవహారంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. చందాదారుల సొమ్ముల్ని మ్యుచువల్ ఫండ్స్,షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఖాతాదారుల సొమ్ముల్ని డిపాజిట్లుగా సేకరించడంపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సీఐడీ జరిపిన సోదాల్లో ఇప్పటికే నలుగురు మార్గదర్శి ఉద్యోగులు అరెస్టయ్యారు. మరోవైపు కంపెనీ ఆడిట్ వ్యవహారాలు చూసే బ్రహ్మయ్య అండ్ కో కంపెనీ ఆడిటర్ శ్రావణ్‌ను సీఐడీ అరెస్టు చేసింది.
Also read: CM Jagan Mohan Reddy: ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారి అకౌంట్లలో రేపే డబ్బులు జమ
బ్యాలెన్స్ షీట్ నిర్వహించకపోవడమే కాకుండా చిట్ గ్రూప్‌కు చెందిన ఫారం 21ను మార్గదర్శి సంస్థ సమర్పించలేదని ఏపీ సీఐడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే మార్గదర్శిపై ఐపీసీ సెక్షన్లు 420, 409, 120బి, 477 రెడ్ విత్ 34 కింద కేసులు నమోదు చేయాలన్నారు.
Also read: EBC Nestham Scheme Founds: అకౌంట్‌లోకి డబ్బులు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook