Vijayawada fire Accident: ప్రారంభమైన చర్యలు..ముగ్గురి అరెస్టు

విజయవాడ కోవిడ్ సెంటర్ ( Covid centre fire ) అగ్నిప్రమాద ఘటనలో చర్యలు ప్రారంభమయ్యాయి. బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా..పలుచోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.

Last Updated : Aug 10, 2020, 06:20 PM IST
Vijayawada fire Accident: ప్రారంభమైన చర్యలు..ముగ్గురి అరెస్టు

విజయవాడ కోవిడ్ సెంటర్ ( Covid centre fire ) అగ్నిప్రమాద ఘటనలో చర్యలు ప్రారంభమయ్యాయి. బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా..పలుచోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.

విజయవాడ ( Vijayawada ) కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశారు. రమేష్ ఆసుపత్రి ( Ramesh Hospital ) ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కొడాలి రాజగోపాల్ రావుతో పాటు జనరల్ మేనేజర్ సుదర్శన్, మరో మేనేజర్ వెంకటేశ్ లను సోమవారం అరెస్టు చేశారు. హోటల్ నిర్వాహకులతో రమేష్ ఆసుపత్రి యాజమాన్యం చేసుకున్న ఒప్పంద పత్రాల్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

విజయవాడలోని స్వర్ణప్యాలేస్ హోటల్ ( swarna palace ) ను రమేష్ ఆసుపత్రి లీజుకు తీసుకుని గత ఆరు నెలల్నించి కోవిడ్ సెంటర్ నడుపుతోంది. ఈ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగి 11 మంది మరణించారు. ఈ ఘటనను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. విచారణ కమిటీను ఏర్పాటు చేసి...48 గంటల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కోరింది. Also read: Vijayawada Fire accident: మృతుల కుటుంబాలకు కేంద్రం ఆర్ధిక సహాయం

Trending News