Tollywood: బ్రేకింగ్: తెలుగు సినిమా షూటింగ్ లు బంద్.. సమ్మెలోకి సినీ కార్మికులు

Tollywood: బాలీవుడ్ ను షేక్ చేస్తూ దూసుకెళ్తున్న టాలీవుడ్ కు షాకింగ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్ లు నిలిచిపోనున్నాయి. వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగుతుండటంతో బుధవారం నుంచి టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు పూర్తిగా నిలిచిపోనున్నాయి.

Written by - Srisailam | Last Updated : Jun 21, 2022, 03:32 PM IST
  • సమ్మెలోకి సినీ కార్మికులు
  • రేపటి నుంచి షూటింగ్ లు బంద్
  • ఫిల్మ్ ఫెడరేషన్ దగ్గర ఆందోళన
Tollywood: బ్రేకింగ్: తెలుగు సినిమా షూటింగ్ లు బంద్.. సమ్మెలోకి సినీ కార్మికులు

Tollywood: బాలీవుడ్ ను షేక్ చేస్తూ దూసుకెళ్తున్న టాలీవుడ్ కు షాకింగ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్ లు నిలిచిపోనున్నాయి. వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగుతుండటంతో బుధవారం నుంచి టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన  సినీ కార్మికులు వేతనాలు పెంచాలంటూ సమ్మెకు నోటీసులు ఇచ్చారు. ఇన్ని రోజుల వరకు వేతనాలు పెంచకుండా ఉన్నందుకు రేపటి నుండి సమ్మెలోకి వెళ్లాలని సినిమా కార్మికులు నిర్ణయించారు. వేతనాలు పెంచే వరకు షూటింగ్ కు వెళ్లమని తేల్చి చెప్పారు. వేతనాలు పెంచేలా ఫెడరేషన్ మీద ఒత్తిడి చేయడానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన 24 యూనియన్ సభ్యులు బుధవారం ఉదయం ఫెడరేషన్ ముట్టడి చేయుచున్నారు.

కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా సినీ ఇండస్ట్రీ సంక్షోభంలో పడింది. షూటింగ్ లు నిలిచిపోవడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. కొందరు కార్మికులు తినడానికి తిండి కూడా లేకా ఇబ్బందులు పడ్డారు. కొవిడ్ ప్రభావం తగ్గడంతో ఇప్పుడిప్పుడే  ఇండస్ట్రీ కోలుకుంటోంది. కొత్త సినిమాలు మొదలయ్యాయి. అయితే  హీరోలకు భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్న నిర్మాతలు.. ఇండస్ట్రీలో పనిచేసే 24 క్రాఫ్ట్ సిబ్బందిని మాత్రం గాలికొదిలేశారు. గత కొన్నేళ్లుగా సినీ కార్మికుల వేతనాలు పెరగలేదు. చమురు, నిత్యావరస ధరలు పెరగడంతో ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో జీవితం వెళ్లదీసేందుకు కష్టాలు పడుతున్నారు సినీ కార్మికులు.

వేతనాలు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. తమ పనికి తగిన వేతనం ఇవ్వాలని కోరుతున్నారు సినీ కార్మికులు. జీతాలు పెంచాలంటూ కొంత కాలంగా  నిర్మాతల మండలిపై ఒత్తిడి తెస్తున్నారు సినీ కార్మికులు. అయినా స్పందన లేకపోవడంతో సమ్మెకి దిగాలని నిర్ణయించారు. జూన్ 22 నుంచి సమ్మె చేస్తున్నట్లు 24 క్రాఫ్ట్ నేతలు తెలిపారు. వేతనాలు పెంచేవరకు సినీ ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ వారు షూటింగ్‌కు రాకూడదని నిర్ణయించారు. బుధవారం ఉదయం ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడి చేయన్నారు. సినీ కార్మికుల సమ్మెతో షూటింగ్ లు నిలిచిపోనున్నాయి. దీనిపై ఫిల్మ్ ఫెడరేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.

Read also: Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల్లో ట్విస్ట్.. టీఎంసీకి యశ్వంత్ సిన్హా రాజీనామా?

Read also: Sai Pallavi: విరాటపర్వాన్ని 'విషాదపర్వం'గా మార్చేసిందిగా! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News