Tirumala: టీటీడీపై దుష్ప్రచారం.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

Fake News on TTD: తిరుమల శ్రీవారి దేవాస్థానంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈవో ధర్మారెడ్డి. నడక మార్గానికి ఇరువైపులా ఉన్న రెండు రాతి మండపాల్లో ఒకటి శిథిలావస్థకు చేరుకుందని.. మరమ్మతులు చేపట్టినట్లు వెల్లడించారు.

Written by - Ashok Krindinti | Last Updated : Oct 4, 2023, 02:58 PM IST
Tirumala: టీటీడీపై దుష్ప్రచారం.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

Fake News on TTD: తిరుమల నడక మార్గంలో అలిపిరి పాదాల మండపం వద్ద భక్తులు విశ్రాంతి తీసుకునే  పురాతన రాతి మండపం శిధిలావస్థకు చేరుకుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. దీనిని త్వరలో పున‌ర్నిర్మించనున్నట్లు వెల్లడించారు. బుధవారం ఉదయం అలిపిరి పాదాల మండపం వద్ద ఈవో, జేఈవో  వీరబ్రహ్మంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. 16వ శతాబ్దంలో అప్పటి రాజులు శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు నడక మార్గానికి ఇరువైపులా రెండు రాతి మండపాలు నిర్మించినట్లు తెలిపారు. 

ఈ మండపాలలో ఒకటి శిథిలావస్థకు చేరుకున్నదని చెప్పారు. ఈ మండపాన్ని గతంలో ఇదివరకే ఒకసారి మరమ్మతులు చేశారని తెలిపారు. ప్రస్తుతం ఈ మండపానికి మరమ్మతులు చేసేందుకు కూడా వీలుకాదని టీటీడీ ఇంజనీరింగ్ విభాగం వారు ఇచ్చిన నివేదిక అనుసరించి దీనిని  పునర్నిర్మించాలని టీటీడీ నిర్ణయించిందన్నారని పేర్కొన్నారు. 

ఇందులోని రాతి స్తంభాలు, పై  కప్పును పునర్నిర్మాణంలో వినియోగిస్తామని తెలిపారు ఈవో ఏవీ ధర్మారెడ్డి. ఈ మండపం వెనుక వైపున గోడ పూర్తిగా కూలిపోయిందని.. మండపంలోనికి భక్తులు వెళ్లకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. రూ.1.36 కోట్లతో త్వరలో ఈ రాతి మండపం పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. 

గతంలో తిరుమలలోని పార్వేటి మండపం శిథిలావస్థకు చేరుకున్నందున పునర్నిర్మించినప్పుడు కూడా కొన్ని సామాజిక మధ్యమాలలో, కొందరు వ్యక్తులు టీటీడీ పై దుష్ప్రచారం చేశారని ఈవో తెలిపారు. దీనివలన భక్తుల మనోభావాలు దెబ్బతింటుందన్నారు. ఇకపై ఇలాంటి దుష్ప్రచారం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు ఈవో మండపం వెనుక వైపు దెబ్బతిన్న గోడను, మండపంలోని రాత్రి స్తంభాల గురించి మీడియాకు  వివరించారు.

తిరుమల శ్రీవారిని స్పార్క్ సినిమా హీరో విక్రమ్, హీరోయిన్ మెహ్రీన్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం నైవేధ్య విరామంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హీరోయిన్ మెహ్రీన్ మాట్లాడుతూ.. ఈరోజు సినిమాలో ఒక సాంగ్‌ను తిరుపతిలో విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నామని చెప్పారు. తన అన్ని సినిమాలు ఆదరించారని.. ఈ సినిమాని కూడా సూపర్ హిట్ చేయాలని కోరారు. 

Also Read: MP Bandi Sanjay: ఖబడ్డార్ ట్విట్టర్ టిల్లు.. మంత్రి కేటీఆర్‌కు బండి సంజయ్ వార్నింగ్

Also Read: ICC World Cup 2023: వరల్డ్ కప్ ఆరంభానికి ముందు బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. నిరాశలో క్రికెట్ అభిమానులు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News