TTD Alerts Devotees On Fake Website: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నకిలీ వెబ్‌సైట్‌తో కేటుగాళ్లు మోసానికి పాల్పడుతున్నారు. నకిలీ వెబ్‌సైట్‌ను గుర్తించిన టీటీడీ ఐటీ విభాగం.. తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు హెచ్చరిస్తున్నారు. https://tirupatibalaji.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ అని.. https://tirupatibalaji-ap-gov.org/ అనేది ఫేక్ వెబ్‌సైట్ అని చెప్పారు. అధికారిక వెబ్‌సైట్‌లానే కొన్ని మార్పులు చేసి ఫేక్ వెబ్‌సైట్ క్రియేట్ చేశారని తెలిపారు.
టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు ఏపీ ఫోరెన్సిక్ సైబర్ సెల్ కూడా నకిలీ వెబ్‌సైట్‌పై విచారణ చేపట్టింది. ఇప్పటివరకు మొత్తం 40 నకిలీ వెబ్‌సైట్లపై ఇప్పటివరకు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడ 41వ ఫేక్ వెబ్‌సైట్‌ను గుర్తించారు. దాదాపు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్‌ను అక్రమార్కులు స్వల్ప మార్పులతో రూపొందించారని చెప్పారు. ఇలాంటి నకిలీ వెబ్‌సైట్ల బారిన పడవద్దని విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్ టిక్కెట్‌లను బుక్ చేసుకునే ముందు సరైన వెబ్‌సైట్ ఆధారాలను చెక్ చేసుకోవాలని సూచించారు. టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ద్వారా కూడా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పారు.
ఇక భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఆదివారం పీఏసీ 1 సమీపంలో మరో అన్నప్రసాదం కౌంటర్‌ను ప్రారంభించింది టీటీడీ. ఆదివారం పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ ప్రారంభించారు. ప్రతిరోజూ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య.. మళ్లీ సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 గంటల వరకు అన్నప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈ కొత్త కౌంటర్‌తో పాటు తిరుమలలోని ఎంటీవీఏసీ, పాత అన్నం కాంప్లెక్స్‌లోని పీఏసీ 4, పీఏసీ 2, సీఆర్‌ఓ, రాంభాగీచా ఫుడ్ సెంటర్లలో కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చే సామాన్య భక్తుల కోసం అన్నప్రసాదం అందజేస్తున్నారు.
Also Read: RCB vs RR Playing 11: టాస్ గెలిచిన రాజస్థాన్.. కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లీ
ఇక తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం 72,631 భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి వారికి హుండీకి రూ.2.85 కోట్ల ఆదాయం వచ్చింది. 19 కంపార్టమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
Also Read: IPL 2023 Updates: కేఎల్ రాహుల్, డేవిడ్ వార్నర్ ఇదేం బ్యాటింగ్ భయ్యా..! స్ట్రైక్ రేట్ ఏది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి