Vijayawada Flyover: రేపే కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడ వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చిరకాల కోరిక మరికొన్ని గంటల్లో నెరవేరనుంది. కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ( Vijayawada Kanakadurga flyover) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది.

Last Updated : Oct 15, 2020, 05:43 PM IST
Vijayawada Flyover: రేపే కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవం

Kanakadurga flyover inauguration: అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడ వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చిరకాల కోరిక మరికొన్ని గంటల్లో నెరవేరనుంది. కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ( Vijayawada Kanakadurga flyover) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. శుక్రవారం ఉదయం (tomorrow) 11.30 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ( Nitin Gadkari ) వర్చువల్‌గా కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. ఈ వర్చువల్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Y. S. Jaganmohan Reddy) కూడా పాల్గొననున్నారు. అయితే ఈ కనకదుర్గ ఫ్లై ఓవర్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 16 జాతీయ రహదారులపై రూ .15,592 కోట్ల అంచనాతో నిర్మించనున్న, నిర్మించిన 1411 కిలోమీటర్ల పొడవు గల ప్రాజెక్టులకు కూడా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారని కేంద్ర మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. 

Kanakadurga flyover

మొత్తం మీద రాష్ట్రంలో 61 ప్రాజెక్టుల పనులను అధికారులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం అయ్యాక మొదటి సారిగా ఆర్అండ్‌బీ మంత్రి శంకర్ నారాయణ, అధికారులు దీనిపై ప్రయాణించనున్నారు. 

Vijayawada Flyover

ఇదిలాఉంటే.. ముందుగా ఈ కనకదుర్గ ఫ్లైఓవర్‌ను సెప్టెంబరు 4న ప్రారంభించాలని భావించారు. ఆ సమయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూసిన నేపథ్యంలో కేంద్రం వారం రోజుల పాటు సంతాప దినాలను పాటించాలని ప్రకటించడంతో.. అప్పుడు ఈ కార్యక్రమాన్ని 18వ తేదీకి వాయిదా వేశారు. ఈ క్రమంలో సెప్టెంబరు 16 కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో మళ్లీ వాయిదా వేశారు. అయితే ఫ్లై ఓవర్ ( Flyover ) ను ప్రారంభించనున్న నేపథ్యంలో గతనెలలోనే సామర్ధ్యాన్ని పరీక్షించే చివరి పరీక్షల్ని సైతం హైవే అధికారులు నిర్వహించిన సంగతి తెలిసిందే.  Also read: Heavy Rains: ముంబైలో రెడ్ అలెర్ట్

Also read: Hyderabad Rains: 15కు చేరిన మరణాల సంఖ్య.. కొనసాగుతున్న రెస్క్యూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News