కడప: వివేకనందరెడ్డి హత్యేనని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. అయితే ఇప్పుడు ఆయన్ను హత్య చేసింది ఎవరనేదే ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో వివేక హత్య కేసులో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. వివేకా హత్య వెనుక సుధాకర్ రెడ్డి ఉన్నాడని వైఎస్ కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
జగన్ తాతా వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుధాకర్ రెడ్డి సత్పర్తన కింద మూడు నెలల క్రితం కడప సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యాడు. పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే వివేకాను సుధాకర్‌రెడ్డి హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో జైలు నుంచి విడుదలైన తర్వాత సుధాకర్ రెడ్డి ఎవరితో తిరిగాడు..ఎవరిని కలిశాడు అన్నకోణం పోలీసులు విచారణ జరుపుతున్నారు