Andhra Pradesh: TTDకు అరుదైన గుర్తింపు.. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం..

తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గౌరవం దక్కింది. ఇంగ్లాండ్ కు చెందిన  వరల్డ్‌ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌ లో చోటు సంపాదించింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 07:55 PM IST
Andhra Pradesh: TTDకు అరుదైన గుర్తింపు.. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం..

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానాని(TTD)కి అరుదైన గుర్తింపు లభించింది. తితిదేకు ఇంగ్లాండ్‌కి చెందిన వరల్డ్‌ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌(World Book of Records) సంస్థ సర్టిఫికెట్‌ అందజేసింది. శనివారం తిరుమలలో తితిదే పాలకమండలి ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి(YV Subbareddy)కి ఆ సంస్థ ప్రతినిధులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ప్రపంచంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు గాను ఈ గౌరవం దక్కింది.

Also Read: Amit Shah, YS Jagan : అమిత్‌ షాను కలవనున్న సీఎం వైఎస్‌ జగన్‌

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భక్తులకు సేవలు, సదుపాయాలు అందిస్తోందని వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. సాధారణ రోజుల్లో తిరుమల(Tirumala)లో 60 నుంచి 70వేల మంది భక్తులకు చిన్న పాటి అసౌకర్యం కూడా లేకుండా సంతృప్తికరమైన దర్శనం చేయిస్తున్నామన్నారు. క్యూలైన్ల నిర్వహణ శాస్త్రీయ పద్ధతిలో జరుగుతోందని సుబ్బారెడ్డి చెప్పారు. రోజుకు 3.5లక్షల లడ్డూలు ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారు చేస్తున్నట్టు వివరించారు.

రేపు తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ
ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amit Shah) అధ్యక్షతన తిరుపతి వేదికగా సదరన్ జోనల్ కౌన్సిల్(Southern Zonal Council Meeting) భేటీ కానుంది.ఈ సమావేశంలో 26 అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌, లక్షదీవుల ముఖ్యమంత్రులు/లెఫ్టినెంట్‌ గవర్నర్‌లు, ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ భేటీకి సుమారు 90 నుంచి 100 మంది హాజరుకానున్నట్లు సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News