Amit Shah, YS Jagan : అమిత్‌ షాను కలవనున్న సీఎం వైఎస్‌ జగన్‌

Union Home Minister Amit Shah: సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కలిసి తిరమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. సీఎం జగన్‌ నేడు సాయంత్రం గన్నవరం నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. తిరుపతి తాజ్‌ హోటల్‌లో జరగనున్న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న కేంద్రమంత్రి అమిత్‌షాకు జగన్ స్వాగతం పలుకుతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 01:52 PM IST
  • ఏపీలో కేంద్ర హోంశాఖామంత్రి అమిత్‌ షా మూడు రోజుల పర్యటన
  • తిరుపతిలో అమిత్‌ షాకు స్వాగతం పలకనున్న ఏపీ సీఎం జగన్‌
Amit Shah, YS Jagan : అమిత్‌ షాను కలవనున్న సీఎం వైఎస్‌ జగన్‌

Union Home Minister Amit Shah to begin 3-day visit to Andhra Pradesh today, will be received by CM YS Jagan: కేంద్ర హోంశాఖామంత్రి అమిత్‌ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం తిరుపతికి రానున్నారు. ఏపీ సీఎం జగన్‌ ఇవాళ సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు (Union Home Minister Amit Shah) స్వాగతం పలుకుతారు. 

ఇక సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కలిసి తిరమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. సీఎం జగన్‌ నేడు సాయంత్రం గన్నవరం నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. తిరుపతి తాజ్‌ హోటల్‌లో జరగనున్న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న కేంద్రమంత్రి అమిత్‌షాకు జగన్ స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి తిరుమల (Tirumala) వెళతారు. రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కలిసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy) శ్రీవారిని దర్శించుకుంటారు. 

తర్వాత సీఎం జగన్‌ తిరిగి తాడేపల్లి (Thadepalli) బయలుదేరుతారు. మళ్లీ ఆదివారం మధ్యాహ్నం 1.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ (Gannavaram Airport) నుంచి తిరుపతి బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుపతి తాజ్‌ హోటల్‌లో అమిత్‌ షా అధ్యక్షతన జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు.

Also Read :10 digit Mobile Number: అవును.. ఫోన్ నంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుంది..??

కాగా కేంద్రమంత్రి అమిత్‌షా ఆదివారం ఉదయం భారత వైమానిక దళ హెలికాప్టర్‌ లో బయల్దేరి నెల్లూరు (Nellore) జిల్లా వెంకటాచలానికి చేరుకుంటారు. అక్షర విద్యాలయ, స్వర్ణ భారతి ట్రస్టు, ముప్పవరపు ఫౌండేషన్‌లకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం స్వర్ణ భారతి ట్రస్టు (Swarna Bharati Trust) 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.

తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతిలోని (Tirupati) తాజ్‌ హోటల్‌కు చేరుకుంటారు. అదే హోటల్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు. ఆ భేటీ ముగిశాక ఆదివారం రాత్రి తాజ్‌ హోటల్‌లోనే బస చేస్తారు. 

Also Read :Allu Arjun vs Nani: బిగ్ షాక్: శ్యామ్ సింగరాయ్ కు పోటీగా పుష్ప!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News