ప్రజల సానుభూతి వల్లే వైసీపీకి గెలుచిందని..జనాల్లో టీడీపీ పట్ల ఎలాంటి ఆగ్రహం లేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత విజయసారయిరెడ్డి వ్యగ్యంగా స్పందించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రజల ఆగ్రహం వల్ల ఓడిపోలేదట. సానుభూతి వల్లనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని బాబు తేల్చారు.. ఆయన తీరు చూస్తుంటే కిందపడ్డా నేనే గెలిచా అన్నట్టుంది. రాష్ట్రంలో 50 శాతం ఓట్లు పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతితో గెలిచిందని చులకనగా మాట్లాడుతున్నారని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాబులో ఇక మార్పు రాదు
ప్రమాణ స్వీకారానికి ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబుకు ఆహ్వానించి వైఎస్ జగన్ హుందాగా ప్రదర్శిస్తే ....దాన్ని కూడా చంద్రబాబు వక్రీకరిస్తున్నారు. మీ సలహాలు అవసరం, మీరు అనువజ్ణులు అని చంద్రబాబుతో జగన్ అనని మాటలు పుట్టిస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి చంద్రబాబు అనుభవం దోచుకోవడానికి మాత్రమే ఉపయోగించారని..ఇది గ్రహించే యువనేత జగన్ కు పట్టం కట్టారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలకు గాను కేవలం 23 సీట్లకు పరిమితమైన తర్వాత అయినా చంద్రబాబులో మార్పు వస్తుందనుకుంటే ఇంకా రాలేదు. ఇక నువ్వు మారవు బాబూ అంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు సంధించారు.
ప్రజల ఆగ్రహం వల్ల ఓడిపోలేదట. సానుభూతి వల్లనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని తేల్చాడు రాజకీయ మ్యానిపులేటర్ చంద్రబాబు. కిందపడ్డా నేనే గెలిచా అన్నట్టుంది ఆయన వాలకం. గెలిచిన పార్టీకి 50 శాతం ఓట్లు పడిన చరిత్ర ఉందా. దీన్ని సింపతీ అంటారా? మానసిక స్థితి ఇంకా దిగజారినట్టుంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 29, 2019
23 సీట్లకు పతనమైన తర్వాత అయినా పరివర్తన వస్తుందనుకుంటే ఇంకా మీకు రాలేదేంటి బాబూ. అనుకూల మీడియా ఉందని మీ కలలు, ఊహలన్నిటిని రాయించుకుని తృప్తి పడుతున్నారా? జూన్ 8 వరకు పదవీ కాలం ఉందని ఇంకా నమ్ముతున్నారా ఏంటి ఖర్మకాలి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 29, 2019
ప్రమాణ స్వీకారానికి జగన్ గారు హుందాగా ఆహ్వానిస్తే దానికి వేరే స్టోరీ అల్లి మీడియాలో రాయించుకుంటావా? మీ సలహాలు అవసరం, మీరు అనువజ్ణులు అని, ఆయన అనని మాటలు పుట్టిస్తారా? మీ అనుభవం దోచుకోవడానికి మాత్రమే ఉపయోగించావని గ్రహించే యువనేతకు పట్టం కట్టారు ప్రజలు. నువ్వు మారవు బాబూ.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 29, 2019