కేసీఆర్‌ని కలిసిన వైఎస్ జగన్.. ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానం

వైఎస్ జగన్‌ను ఆలింగనం చేసుకుని అభినందించిన కేసీఆర్

Updated: May 25, 2019, 08:30 PM IST
కేసీఆర్‌ని కలిసిన వైఎస్ జగన్.. ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానం

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సతీ సమేతంగా హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌ కి వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిశారు. వైఎస్ జగన్‌ ప్రగతి భవన్‌కు రావడం ఇదే తొలిసారి కావడంతో జగన్ రాక సందర్భంగా ప్రగతి భవన్ వద్ద సందడిపూరిత వాతావరణం కనిపించింది. వైఎస్‌ జగన్‌ దంపతులకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రులతో కలిసి సీఎం కేసీఆర్‌ సాదర స్వాగతం పలికారు. ఈనెల 30న తన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా కేసీఆర్‌ను జగన్‌ ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా జగన్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేసీఆర్.. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు మనసారా అభినందిస్తున్నట్టు తెలిపారు. అనంతరం జగన్‌ను శాలువాతో సత్కరించారు. వైఎస్‌ జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్‌ భారతి, పార్టీ నేతలు విజయ సాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.