Ys Jagan house vastu Changes in Telugu: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉన్నట్టుండి తన ఇంటికి మార్పులు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. తాడేపల్లి ఇంటికి వాస్తు దోషం ఉందని పండితులు చెప్పినట్టు సమాచారం. అందుకే ఇటీవల పలు విమర్శలకు కారణమైన కంచెను తొలగిస్తున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఊహించని విధంగా అధికారం కోల్పోవడం, వరుసగా ఎదురౌతున్న ఇబ్బందులు, తిరుపతి లడ్డూ వ్యవహారం, కీలక నేతలు పార్టీ వీడటం వంటివాటికి కారణం జగన్ తాడేపల్లి ఇంటి వాస్తు అని వాస్తు పండితులు స్పష్టం చేశారు. 2019లో తాడేపల్లి ఇంట్లోకి వచ్చిన తరువాత జగన్ అధికారంలో వచ్చారు. కానీ ఆ తరువాత ఇంట్లో చేసిన కొన్ని మార్పుల వల్ల రాజకీయంగా నష్టం జరిగిందనేది కొందరి అభిప్రాయం. ఇటీవల బెంగుళూరు నుంచి వచ్చిన కొందరు వాస్తు పండితులు కూడా ఇంటిని పరిశీలించి ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇన్నాళ్లూ వాస్తు దోషాన్ని పట్టించుకోని జగన్ ఇప్పుడు సీరియస్‌గా తీసుకున్నారని సమాచారం.
వాస్తుపరంగా ఇంటికి ఉన్న దోషాల్ని తొలగించే పనిలో పడ్డారిప్పుడు. ఇటీవలే ఇంటికి దక్షిణ దిశలో ఉన్న కంచెను తొలగించారు. ఇప్పుడు తాజా ఇంటికి తూర్పు- ఈశాన్యం వైపున్న కంచెను తొలగించారు. తూర్పు-ఈశాన్యం మూసివేయడం మంచిది కాదని వాస్తు పండితులు చెప్పడంతో ఈ మార్పులు చేస్తున్నారు. ఇంటి లోపల కూడా గతంలో చేసిన మార్పుల్ని తొలగిస్తున్నారు.
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నుంచి సెంటిమెంట్ కూడా నమ్మతున్నారు. విశాఖ శారదా పీఠం గురువు స్వరూపానందేంద్ర స్వామి సూచనలకు అనుగుణంగా నడుచుకుంటారు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తుండటంతో మరోసారి వాస్తు మార్పులు చేయాలని నిర్ణయిచుకున్నారు. మరి ఈ వాస్తు మార్పులు జగన్‌కు ఎలా కలిసొస్తాయి, రాజకీయంగా విజయం సాధిస్తారా లేదా అనేది చూడాలి.
Also read: Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్..కీలక తీర్పు వెలువరించిన ఏపీ హైకోర్టు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.