ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ దూకుడు పెంచారు. ఒకవైపు వరుస సమీక్ష నిర్వహిస్తూనే మరోవైపు కేబినెట్ కూర్పు కసరత్తు చేస్తున్నారు. కాగా కేబిబెట్ మూహుర్తాన్ని ఈ నెల 8న ఖరారు చేసిన వైఎస్ జగన్...మంత్రి వర్గ కూర్పుపై ఇప్పటికే అవగాహనకు వచ్చినట్లు తెలిసింది.
మంత్రివర్గంలో చోటు కోసం సీనియర్ మరియు జూనియర్ ఎమ్మెల్యేలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తన కేబినెట్లో సీరియరిటీకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. కాగా సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తూనే రెండో సారి ఎన్నికైన వారికీ మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే మొదటి సారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు చోటు ఉండదని మీడియాలో కథనాలు వెలుడుతున్నాయి.ఈ నేపథ్యంలో మంత్రివర్గం కూర్పుపై నేతలతో పాటు జనాల్లో ఉత్కంఠత నెలకొంది