వైఎస్ వివేకానంద రెడ్డికి కడసారి కన్నీటి వీడ్కోలు

వైఎస్ వివేకానంద రెడ్డికి కడసారి కన్నీటి వీడ్కోలు

Updated: Mar 17, 2019, 12:12 AM IST
వైఎస్ వివేకానంద రెడ్డికి కడసారి కన్నీటి వీడ్కోలు

పులివెందుల: కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహిత మిత్రులు, వైఎస్ అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతకన్నా ముందుగా వైఎస్ వివేకానంద రెడ్డి నివాసం నుంచి పులివెందులలోని రాజారెడ్డి ఘాట్‌ వరకు నిర్వహించిన అంతిమయాత్రకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. 

అజాత శత్రువులాంటి తమ నాయకుడికి జనం అశ్రునయనాలతో నివాళి అర్పించి కన్నీటి వీడ్కోలు పలికారు. వైఎస్‌ జగన్‌‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ కుటుంబసభ్యులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.