YS Jagan: జగన్ రూట్ మార్చబోతున్నారా..? కొత్త వ్యూహం అదేనా..

YS Jagan: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ అధినేత రూట్ మార్చబోతున్నాడా..?.రాష్ట్ర రాజకీయాలపై కాకుండా ఢిల్లీ రాజకీయాల్లో ఆసక్తి చూపుతున్నాడా...? అమరావతి కన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ఢిల్లీయే బెటర్ అని భావిస్తున్నాడా..?.అసలు వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి భవిష్యత్తు రాజకీయాలపై ఏమి ఆలోచిస్తున్నాడు…?

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 23, 2024, 08:42 AM IST
YS Jagan:  జగన్ రూట్ మార్చబోతున్నారా..?  కొత్త వ్యూహం అదేనా..

YS Jagan:  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయాల్లో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నాయకుడు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జగన్..కడప ఎంపీగా కాంగ్రెస్ తరుపున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కానీ తండ్రి హఠాన్మరణంతో జగన్ రాజకీయదారి ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక గుండె పోటుతో చనిపోయిన వారిని ఓదర్చడానికి జగన్ సిద్దమయ్యాడు. ఇదే జగన్ రాజకీయ భవిష్యత్తును మొత్తం మార్చేసింది. ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతివ్వలేదు. అధిష్టానం నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ  జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. ఇక అక్కడి నుంచి కాంగ్రెస్ కు జగన్ కు మధ్య తీవ్ర అగాథం ఏర్పడింది. అ తర్వాత జరిగిన పరిణామాలతో అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లడం. ఆ తర్వాత ప్రత్యేకంగా తనే వైసీపీ పార్టీ పెట్టడం ఇదంతా తెలిసిన విషయమే. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొంది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానికి బిగ్ షాక్ ఇచ్చారు.

ఒక వైపు వైసిపీ పార్టీ పెట్టిన జగన్ ఓదార్పు యాత్రతో సుదీర్ఘ కాలం జనాల మధ్య గడిపాడు. దీంతో కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టం జరిగింది. కాంగ్రెస్ లో ని ఎమ్మెల్యేలు సైతం జగన్ కు పంచన చేరారు. జగన్ తో సహా, పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైసీపీ తరుపున పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇదే జగన్ కు ఎక్కడి లేనంత పాపులారిటీనీ తెచ్చిపెట్టింది. ఇదే సమయంలో కాంగ్రెస్ కు ఒక పక్క తెలంగాణ అంశం మరో పక్క జగన్ అంశం రెండు పెద్ద తలనొప్పిగా మారాయి. కాంగ్రెస్ కు బలమైన రాష్ట్రంగా ఉన్న ఏపీలో ఈ రెండు అంశాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో రూటు మార్చిన  కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేసి ఈ రెండు అంశాలకు చెక్క పెట్టాలనుకుంది. కాంగ్రెస్ అనుకున్నదొక్కటి కానీ చివరికి జరిగింది మరోకటి. ఇటు తెలంగాణలో అటు ఏపీలో రెండు రాష్ట్రాల్లో రెంటికి చెడ్డ రేవడి గా మారింది. అంతేకాదు రాజకీయంగా చాలా నష్టపోయింది.

ఇది ఇలా ఉంటే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ గెలవగా ...ఏపీలో చంద్రబాబు గెలిచారు. జగన్ పార్టీ 67 మంది ఎమ్మెల్యేలతో బలమైన ప్రతిపక్షంగా నిలిచిన సంగతి తెలిసిందే. అలా ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కొత్త కొత్త వ్యూహాలతో 2019లో 151 మంది ఎమ్మెల్యేలతో అద్భుత విజయం సాధించింది. పలు సంక్షేమ కార్యక్రమాలతో జగన్ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సంక్షేమ పథకాలే తనను తిరిగి అధికారంలోకి తీసుకువస్తాయని జగన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ అనుకున్నదానికి భిన్నంగా ఏపీ ఫలితాలు వచ్చాయి. 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ,  తెలుగు దేశం, జనసేన కూటమిగా కలిసి పోటీ చేసి వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాయి. వైసీపీ ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితమై ఘోర ఓటమిని చవిచూసింది.

ఈ ఓటమే జగన్ ను తీవ్ర ఆలోచనలకు గురి చేసింది. ఇప్పటికే జగన్ అసెంబ్లీకీ వెళ్లేది ఇక డౌటే అని వైసీపీలోనే జోరుగా చర్చ సాగుతుంది.కానీ జగన్ ఆలోచన వేరేలా ఉందని టాక్. జగన్ అసెంబ్లీకీ వెళ్లినా అక్కడా ఎలాగో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం అధికారపార్టీ ఇవ్వదని ఒక ఒక వేళ ఇచ్చినా అధికార పార్టీ నుంచి కౌంటర్లు తప్పవనే ఒక క్లారిటీకీ జగన్ వచ్చారని అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఇటు చంద్రబాబు, అటు పవన్ ఇద్దరూ కలిసి జగన్ టార్గెట్ అవకాశం ఎందుకు ఇవ్వాలనే ఆలోచన జగన్ చేస్తున్నట్లు సమాచారం. ఇది జరగకుండా ఉండాలంటే అసలు అసెంబ్లీకీ వెళ్లకుండా ఉంటే బెటర్ కదా అని జగన్ ఆలోచనగా తెలుస్తుంది. దీని కోసం జగన్  కొత్త ఆలోచన చేస్తున్నట్లు  తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. కానీ తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగన్ చురుగ్గా పాల్గొన్నారు.

ఒకవేళ ఈ సమావేశాల్లో తన పై అధికార పక్షం ఎలా ప్రవర్తిస్తుందానిపై జగన్ ఓ నిర్ణయానికి రాబోతున్నట్టు సమాచారం. ఒకవేళ అసెంబ్లీలో తనను పరాభవిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీకీ పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.  దానికి ఒక కారణం లేకపోలేదు. అసలే కేంద్రంలో ఎన్డీయే కూటమి స్వల్ప మెజార్టీతో కొనసాగుతుంది. చంద్రబాబు, నితీష్ లు చాలా కీలకంగా ఉన్నారు. గతంలో వీరు ఎన్డీయే నుంచి అర్థాంతరంగా బయటకు వచ్చని సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఢిల్లీలో ఉంటే రాజకీయంగా మనం కీలకం కావొచ్చు జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.దానిలో భాగంగానే జగన్ పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచన చేస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో కూడా రెండు సార్లు ఎంపీగా పని చేసిన అనుభవం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై వైసీపీ గొంతు వినిపించాలంటే పార్లమెంట్ కు పోటీ చేయడమే కరెక్ట్ అని అనుకుంటున్నారట. అదే సమయంలో  పలు బిల్లులు విషయంలో తమ మద్దతు కేంద్రానికి అవసరం ఉంటుందని అప్పుడు నేరుగా మోదీతో చర్చించే అవకాశం ఉంటుందని అంటున్నారట. ఇప్పటికే మోదీతో జగన్ కు మంచి సంబందాలు ఉన్నాయి. ఢిల్లీ రాజకీయాలకు వెళితే దానిని మరింత బలపర్చుకునే అవకాశం ఉంటుంది కదా చెప్పుకుంటున్నారు. గతంలో అఖిలేష్‌, ములాయం, మమతా బెనర్జీ కూడా అసెంబ్లీలో ఓటమి పాలయ్యాక ఎంపీగా పోటీ చేసిన విషయాన్ని వైసీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. తాజాగా అఖిలేష్ యాదవ్.. అసెంబ్లీకి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.  ఢిల్లీలో ఎంపీగా ఉంటూ  పార్టీనీ బలోపేతం చేసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ చెబుతుంది. దీంతో పాటు ఏపీలో జగన్ తో పాటు వైసీపీ నేతలకు అధికార పార్టీ వేధింపుల నుంచి బయటపడాలంటే జగన్ ఎంపీగా పోవడమే ఉత్తమని అనుకుంటున్నాయట వైసీపీ శ్రేణులు.

అయితే మరీ ఎంపీగా ఎక్కడి నుంచి పోటీ చేయాలని చర్చ జరిగిందట. కడప పార్లమెంట్ స్థానం అయితే బాగుటుందని జగన్ భావిస్తున్నారట. అక్కడ అయితే తన గెలుపుకు తిరుగుండదని అంతే కాదు భారీ మెజార్టీతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపవచ్చని చూస్తున్నారట. మొన్నటి ఎన్నికల్లో డీలా పడ్డ వైసీపీ క్యాడర్ లో జోష్‌ నింపాలంటే ఇదే కరెక్ట్ డెసిషన్ గా జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే జగన్ ఈ ప్లాన్ ను ఎప్పుడు అమలు చేస్తారు. జగన్ నిజంగానే కడప ఎంపీగా పోటీ చేస్తే మరి టీడీపీ ఎలాంటి కౌంటర్ ప్లాన్ సిద్దం చేస్తుందో వెయిట్ అండ్ సీ.

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News