ఇసుకంతా దోచేసి దీక్షకు దిగుతారా ?: టీడీపీపై పార్థసారథి ధ్వజం

ఇసుక కొరతకు స్వయంగా కారకుడై ఉండి ఇసుకపై చంద్రబాబు దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారధి అన్నారు. ఇసుక కొరత తీరిపోయిందని తెలిసినా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దీక్షకు దిగుతున్నారని.. తన ఇసుక కంపును ఇతరులపై రుద్దేందుకే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని పార్థసారథి ఎద్దేవా చేశారు. 

Updated: Nov 13, 2019, 11:20 PM IST
ఇసుకంతా దోచేసి దీక్షకు దిగుతారా ?: టీడీపీపై పార్థసారథి ధ్వజం

అమరావతి: ఇసుక కొరతకు స్వయంగా కారకుడై ఉండి ఇసుకపై చంద్రబాబు దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారధి అన్నారు. ఇసుక కొరత తీరిపోయిందని తెలిసినా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దీక్షకు దిగుతున్నారని.. తన ఇసుక కంపును ఇతరులపై రుద్దేందుకే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని పార్థసారథి ఎద్దేవా చేశారు. 

నేను ఇసుకను దాచాను అని చంద్రబాబు ఆరోపించారు కానీ ఇసుక ఎక్కడ దాచాను, దాచిన ఇసుకతో ఏం పనులు చేశాను అనే వాటిని చంద్రబాబు ఆధారలతో సహా నిరూపించాలి అని పార్ధసారధి సవాల్ విసిరారు. లేదంటే చంద్రబాబు దీక్ష చేస్తున్న ధర్నా చౌక్‌లోనే తాను ధర్నా చేస్తానని ఆయన స్పష్టంచేశారు. అవసరమైతే అందుకోసం విజయవాడ పోలీస్ కమీషనర్‌కు దరఖాస్తు కూడా చేయబోతున్నానని తెలిపారు.

ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడిన పార్థసారథి.. ఇసుకను దోచేసిన టిడిపి నేతలే మాపై ఆరోపణలు చేస్తారా అని మండిపడ్డారు. నువ్వు, మీ లోకేష్ లక్షలకోట్ల అవినీతిని బయటపడకూడదనే ఉధ్దేశ్యంతో ఇసుక రీచ్‌లను దోచేసుకోమని మీ ఎంఎల్ఏలకు అప్పగిస్తే... మీ అండదండలతో నాటి టిడిపి ఎంఎల్ఏలు, టిడిపి నేతలు టన్నుల కొద్ది ఇసుక డంప్ చేసిన మాట వాస్తవం కాదా అని పార్థసారథి ప్రశ్నించారు.