YSRCP Leader Murder: వాకింగ్‌కు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య

వాకింగ్‌కు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేత దారుణహత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం సుబ్బారాయుడు వాకింగ్‌‌కు వెళ్లగా మాటువేసిన కొందరు దుండగులు ఒక్కసారిగా కర్రలతో దాడి చేసి దారుణహత్య (YSRCP Leader Murdered In Kurnool District)కు పాల్పడ్డారు.

Last Updated : Oct 9, 2020, 12:20 PM IST
YSRCP Leader Murder: వాకింగ్‌కు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. నంద్యాలలో వైఎస్సార్‌సీపీ (YSRCP) నేత సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యారు. నంద్యాల (Nandyal) పట్టణానికి చెందిన న్యాయవాది సుబ్బారాయుడు నేటి ఉదయం వాకింగ్‌కు వెళ్లారు. విజయ పాల డెయిరీకి సమీపానికి రాగానే... ఆయన కోసం మాటువేసి ఉన్న కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా కర్రలతో సుబ్బారాయుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ నేత కుప్పకూలిపోయి చనిపోయారు (YSRCP Leader Murdered In Nandyal).

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తోంది. పార్టీకి చెందిన నేత సుబ్బారాయు హత్య విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి సైతం ఘటనాస్థలానికి చేరుకున్నారు. సుబ్బారాయుడిపై దాడి చేసి హత్యకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సుబ్బారాయుడు కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News