అనుచరుడి దారుణ హత్య.. కన్నీళ్లు పెట్టుకున్న ఏపీ మంత్రి

YSRCP Leader Moka Bhaskar Rao | కృష్ణా జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. వైఎస్సార్‌సీపీ నేత, రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కర్ రావు మచిలీపట్నంలో దారుణ హత్యకు గురయ్యారు.

Updated: Jun 30, 2020, 10:52 AM IST
అనుచరుడి దారుణ హత్య.. కన్నీళ్లు పెట్టుకున్న ఏపీ మంత్రి

కృష్ణా జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. వైఎస్సార్‌సీపీ నేత, రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కర్ రావు(Moka Bhaskar Rao) మచిలీపట్నంలో దారుణ హత్యకు గురయ్యారు. భాస్కర్ రావు గతంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా పని చేశారు. ఈ క్రమంలో మునిసిపల్ చేపల మార్కెట్‌లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి పరారుకాగా, భాస్కర్ రావు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గాయపడిన ఆయనను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. భారీగా పెరిగిన వెండి ధరలు.. స్వల్పంగా బంగారం 

మచిలీపట్నం మార్కెట్ యార్డుకు గతంలో చైర్మన్‌గా భాస్కర్ రావు పని చేయడంతో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశారు. భాస్కరరావు అనుచరులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటిపైకి వెళ్తున్న క్రమంలో పోలీసులు వారిని వారించి అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు మచిలీపట్నంలో 144 సెక్షన్ విధించారు. Petrol Price Today: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు

కాగా, భాస్కర్ రావు మరణవార్త విని మంత్రి పేర్ని నాని(Perni Nani) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. భాస్కరరావు మృతదేహాన్ని చూసి మంత్రి కన్నీళ్లు పెట్టుకున్నారు. మీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రాజకీయ కక్షలతో హత్యలు కొనసాగుతున్నాయి. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..   
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ