MLA Rachamallu Siva Prasad Reddy Comments on MP Avinash Reddy Arrest: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ హైకోర్టు నిర్ణయంపై ఆయర అరెస్ట్ అంశం ఆధారపడింది. రెండు పక్షాల నుంచి వాదనలు విన్న కోర్టు.. తీర్పు గురువారానికి వాయిదా వేసింది. దీంతో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ వస్తుందా..? రాదా..? అనేది సస్పెన్షన్‌గా మారింది.
ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఈ కేసులో అవినాష్ రెడ్డిని అనవసంగా ఇరికించారని అన్నారు. 'ఈ హత్యకు అవినాష్ రెడ్డికి సంబంధం లేదు. కేసు విచారణ ప్రారంభం అయినప్పటి నుంచి నేను ఇదే విషయం చెబుతున్నా. అవినాష్ రెడ్డి హింసను ప్రేరేపిస్తారంటే నేను కలలో కూడా విశ్వసించను. ఒకరిని బాధపెట్టే మనస్తత్వం ఆయనది కాదు. అలాంటి ఒక వ్యక్తి మనషిని చంపుతాడా..? హత్య చేయడమని చెబుతాడా..?
సమయం బాగోలేన్నప్పుడు కొన్ని ఆరోపణలు ఎదుర్కొవాల్సి వస్తాది. రాజకీయాలు కలుషితమైనప్పుడు కొన్ని కుట్రలు జరుగుతుంటాయి. వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించడానికి దర్యాప్తు చేస్తున్నట్లు అనిపించడం లేదు. అవినాష్ రెడ్డిని ఇరికించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు ఉంది. దీనికి వెనుక చంద్రబాబు నాయుడు కుట్ర కోణం స్పష్టంగా ఉంది. ఈ కేసులో అవినాష్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ అయినంత మాత్రానా వచ్చిన ఇబ్బంది ఏమి లేదు.
Also Read: Assembly Elections: కర్ణాటక నెక్ట్స్ ముఖ్యమంత్రిపై కాలభైరవ జోస్యం.. ఆయన పంట మళ్లీ పండినట్లేనా..?
మళ్లీ బెయిల్‌పై ఆయన బయటకు వస్తారు. వ్యక్తిని కేసులో ఇరికించేందుకు పలుకుబడి పనిచేస్తుంది.. డబ్బు పనిచేస్తుంది. కానీ న్యాయస్థానాల్లో ఇలాంటివి చెల్లవు. న్యాయస్థానాల్లో ఇలాంటి ప్రయోగాలు ఏవీ పనిచేయవు. న్యాయస్థానం అత్యంత పవిత్రమైనది. శక్తివంతమైనది. న్యాయస్థానాలపై సంపూర్ణ నమ్మకం ఉంది. కొండను తవ్వి ఎలుకని పట్టుకున్నట్లు ఈ కేసులో అవినాష్ రెడ్డి రెండు మూడు నెలలకు జైలుకు పంపాలనేది వారి ఆలోచన. ఈ నేరం అంతా రాజశేఖర్ కుటుంబానికి అంటించి.. జగన్‌ను డీ గ్లామర్ చేసి 2024 ఎన్నికల్లో ఈ అంశాన్ని వాడుకోవాలనేది వాళ్ల కుట్ర..' అని రాచమల్లు అన్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ పాత్ర ఉందని నిరూపితమైతే తాను రాజకీయాల్లో ఉండనని చెప్పానని.. ఆ మాటకు కట్టుబడి ఉన్నానని అన్నారు. నిందితుడిగా చేరిస్తే.. రాజీనామా చేస్తానని చెప్పలేదన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook