Aadhaar Latest Updates: ఆధార్ కార్డ్‌లో డేట్ ఆఫ్ బర్త్‌ను ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..? ఈ రూల్స్‌ తెలుసా..!

Aadhaar Date of Birth Updates: మీరు ఆధార్‌ కార్డులో డేట్ ఆఫ్ బర్త్‌ తప్పుగా ఉందా..? ఎలా మార్చుకోవాలని ఆలోచిస్తున్నారా..? సింపుల్‌గా ఆన్‌లైన్‌లోనే మార్చుకోవచ్చు. అయితే ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..? ఏమి అవసరమో ఇక్కడ తెలుసుకోండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2023, 06:58 PM IST
Aadhaar Latest Updates: ఆధార్ కార్డ్‌లో డేట్ ఆఫ్ బర్త్‌ను ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..? ఈ రూల్స్‌ తెలుసా..!

Aadhaar Date of Birth Updates: ప్రస్తుతం మన దేశంలో ఆధార్ కార్డు ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాంక్ ఖాతా తెరవడం నుంచి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడం వరకు.. కాలేజీలో అడ్మిషన్ నుంచి లోన్‌ల కోసం అప్లై చేసుకునే వరకు ప్రతి పనికి ఆధార్ తప్పనిసరిగా కావాల్సిందే. అంత ముఖ్యమైన ఆధార్‌లో ఏమైనా తప్పులు ఉంటే.. మీకు ఏ పని జరగదు. ఆధార్ కార్డ్ వివరాలను ఆన్‌లైన్‌లో లేదా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించి అప్‌డేట్ చేసుకోయవచ్చు. మీ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడానికి మీ ఆధార్ కార్డ్‌కి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను లింక్ చేసి ఉండాలి. మీరు UIDAI వెబ్‌సైట్‌ని సందర్శించి.. మీ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డ్ హోల్డర్ ఎవరైనా కేవలం రెండు సార్లు మాత్రమే పేరు మార్చుకోవచ్చు. అంతేకాకుండా ఆధార్ కార్డులో పుట్టిన తేదీకి సంబంధించిన సమాచారం కూడా రెండుసార్లు మాత్రమే మార్చుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఆధార్ కార్డులో లింగం అప్‌డేట్ చేసేందుకు ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్‌ని అప్‌డేట్ చేసేందుకు UIDAI పరిమితిని నిర్ణయిస్తుంది.

మీ ఆధార్ కార్డ్‌లో మీ పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే.. ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.in/ కి వెళ్లి లాగిన్ అవ్వండి. మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి. ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఆ తరువాత ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి ప్రొసీడ్‌పై క్లిక్ చేయండి. కొత్త పేజీని ఓపెన్ తరువాత పేరు మార్పు ఆప్షన్‌ను ఎంచుకుని.. అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అటాచ్ చేయండి. అనంతరం సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేసి.. సెండ్ ఓటీపీ ఆప్షన్‌ని ఎంచుకోండి. మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే.. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. 

ఈ అభ్యర్థన తిరస్కరణకు గురైతే.. 1947కు కాల్ చేయండి లేదా help@uidai.gov.inకి మెయిల్ చేయండి. మీ లేటెస్ట్ అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్, కాంటాక్ట్ అడ్రస్‌ను యాడ్ చేసి.. 'మినహాయింపు నవీకరణ' కోసం రిక్వెస్ట్ పంపించండి. మీ ఆధార్ కార్డ్‌లో పుట్టిన తేదీని ఒకసారి మాత్రమే సరిచేసుకోవచ్చు. మీరు దాన్ని మళ్లీ సరిచేయాలనుకుంటే.. మీరు మినహాయింపు ప్రక్రియను అనుసరించాలి. సరైన డాక్యూమెంట్స్‌ను  UIDAIకి సమర్పించండి. UIDAI మీ అభ్యర్థనను సమీక్షించి.. ఆమోదించాలా వద్దా అని నిర్ణయిస్తుంది. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News