Airtel Axis Credit Card: యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఈ రెండు సంస్థలు కలిసి.. తమ కస్టమర్ల కోసం ఓ సరికొత్త క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చాయి. కో - బ్రాండెడ్ పేరిట ఆ క్రెడిట్ కార్డును మార్కెట్లోకి విడుదల చేశాయి. దీంతో పాటు ఈ క్రెడిట్ కార్డుపై పలు రకాల ఆఫర్లను ప్రకటించాయి. ఎయిర్ టెల్ వినియోగదారులు తమ పేమెంట్స్ యాప్ ద్వారా క్యాష్ బ్యాక్, స్పెషల్ డిస్కౌంట్స్, డిజిటల్ వోచర్స్, కాంప్లిమెంటరీ సర్వీసెస్ ను పొందేందుకు అవకాశం ఉంది. కో - బ్రాండెడ్ క్రెడిట్ కార్డు లాంఛింగ్ సందర్భంగా ఎయిర్ టెల్ దక్షిణాసియా సీఈఓ, ఎండీ గోపాల్ విఠల్ మాట్లాడారు.
"మా కస్టమర్లకు వరల్డ్ క్లాస్ డిజిటల్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పటిష్టమైన ఫైనాన్షియల్ సర్వీసెస్ పోర్ట్ ఫోలియోను క్రియేట్ చేస్తున్నాం. ఎయిర్ టెల్ కస్టమర్లు.. టెల్కో-బ్యాంకు భాగస్వామ్యంతో ఉన్న యాక్సిస్ బ్యాంకు వరల్డ్ క్లాస్ ఫైనాన్షియల్ సేవలు పొందవచ్చు" అని ఎయిర్ టెల్ దక్షిణాసియా సీఈఓ, ఎండీ గోపాల్ విఠల్ అన్నారు.
ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఆఫర్లు
ఎయిర్ టెల్ కంపెనీకి సంబంధించిన మొబైల్, డీటీహెచ్ రీఛార్జ్, ఫైబర్ పేమెంట్స్ పై అత్యధికంగా 25 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందవచ్చు. దీంతో పాటు ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ బిల్లులను ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా చెల్లిస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ లపై అత్యధికంగా 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇతర ఆన్ లైన్ పేమెంట్స్ పై కూడా క్యాష్ బ్యాక్ పొందేందుకు అవకాశం ఉంది. అయితే ఈ క్రెడిట్ కార్డు జారీ చేసిన 30 రోజుల్లోపు యాక్టివేట్ చేస్తే రూ. 500 విలువైన వోచర్ ను పొందవచ్చు.
Also Read: Flipkart Samsung TV: రూ.21 వేల విలువైన శాంసంగ్ స్మార్ట్ టీవీని రూ.6 వేలకే కొనేయండి!
Also Read: Railway Tickets: రైలు ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ కోసం ఇకపై క్యూ లైన్ అవసరం లేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook