Airtel Recharge Plans: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ 4 కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను మంగళవారం (జూలై 5) లాంచ్ చేసింది. ఈ ప్లాన్స్ అన్నీ రూ.150 లోపే ఉన్నాయి. రూ.109, రూ.111, రూ.128, రూ.131 ధరలతో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఎయిర్‌టెల్ ఈ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. ఈ నాలుగు ప్లాన్స్ 30 రోజులు, నెల రోజుల వాలిడిటీతో కూడుకున్నవి కావడం విశేషం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాన్స్‌లో చాలావరకు 28 రోజుల వాలిడిటీని అందించేవే. తాజాగా లాంచ్ అయిన ఈ ప్లాన్స్‌తో కస్టమర్స్ 30 రోజుల వాలిడిటీని పొందుతారు.
రూ.109 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ ద్వారా రూ.99 టాక్ టైమ్ లభిస్తుంది. లోకల్, ఎస్టీడీ, ల్యాండ్ లైన్ వాయిస్ కాల్స్‌కి సెకనుకు రూ.2.5 చొప్పున ఛార్జీ పడుతుంది. లోకల్ ఎస్ఎంఎస్‌లకు రూ.1, ఎస్టీడీ ఎస్ఎంఎస్‌లకు రూ.1.44 ఛార్జీ పడుతుంది. అలాగే రోజుకు 200 ఎంబీ డేటా పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు.
రూ.111 ప్లాన్ :
ఈ ప్లాన్ ద్వారా నెల రోజుల వాలిడిటీ పొందుతారు. అంటే.. నెలకు 30 రోజులు ఉన్నా, 31 రోజులున్నా.. అన్ని రోజుల పాటు వాలిడిటీ వర్తిస్తుంది. రోజుకు 200 ఎంబీ డేటా పొందుతారు. రూ.99 టాక్ టైమ్ లభిస్తుంది. లోకల్, ఎస్టీడీ, ల్యాండ్ లైన్ వాయిస్ కాల్స్‌కి సెకనుకు రూ.2.5 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. లోకల్ ఎస్ఎంఎస్‌లకు రూ.1, ఎస్టీడీ ఎస్ఎంఎస్‌లకు రూ.1.5 చొప్పున ఛార్జీ పడుతుంది.
రూ.128 ప్లాన్ :
ఇది 30 రోజుల వాలిడిటీతో కూడిన ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా లోకల్, ఎస్టీడీ కాల్స్‌కు సెకనుకు రూ.2.5 చొప్పున ఛార్జీ పడుతుంది. నేషనల్ వీడియో కాల్స్‌కు సెకనుకు రూ.5 చెల్లించాలి. మొబైల్ డేటా ఒక ఎంబీకి 0.50 పైసలు ఛార్జీ పడుతుంది.
రూ.131 ప్లాన్ :
ఇది నెల రోజుల రీఛార్జ్ ప్లాన్. అంటే ఈ నెల 1వ తేదీన మీరు రీఛార్జ్ చేయించుకుంటే మళ్లీ 1వ తేదీ వరకు వాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా లోకల్, ఎస్టీడీ కాల్స్‌కు సెకనుకు రూ.2.5 చొప్పు, నేషనల్ వీడియో కాల్స్‌కు సెకనుకు రూ.5 చొప్పున ఛార్జీ పడుతుంది. లోకల్ ఎస్ఎంఎస్‌కు రూ.1 చొప్పున, ఎస్టీడీకి రూ.1.5 చొప్పున ఛార్జీ పడుతుంది.
Also Read: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్..కీలక సూచనలు చేసిన వాతావరణ శాఖ..!
Also Read: Bandi Sanjay: బండి సంజయ్ సంచలనం.. గులాబీలో కలవరం! కేసీఆర్ కు ఇక చుక్కలేనా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Airtel Recharge Plans: ఎయిర్‌టెల్ నుంచి 4 కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. తక్కువ ధరకే నెల రోజుల వాలిడిటీ...
ఎయిర్‌టెల్ నుంచి నాలుగు కొత్త రీఛార్జ్ ప్లాన్స్
రూ.150 లోపే నాలుగు కొత్త ప్లాన్స్
30 రోజులు, నెల రోజుల వాలిడిటీతో అందుబాటులో