Amazon Satellite Internet: త్వరలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న అమెజాన్

Amazon Satellite Internet: ప్రపంచంలో అతిపెద్ద ఈ కామర్స్ వేదికగా ఉన్న అమెజాన్ ఇప్పుడు మరో రంగంలో అడుగుపెట్టనుంది. త్వరలో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 12, 2023, 04:23 PM IST
Amazon Satellite Internet: త్వరలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న అమెజాన్

Amazon Satellite Internet: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ తరహా వ్యాపారంలో అమెజాన్ ప్రవేశిస్తోంది. శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని ప్రారంభించేందుకు ప్రాజెక్ట్ కైపర్‌కు శ్రీకారం చుడుతోంది. ఇండియాలో సైతం ప్రారంభించేందుకు వీలుగా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. 

అతిపెద్ద ఈ కామర్స్ వేదిక అమెజాన్ ఇప్పటికే ఎంటర్‌టైన్‌మెంట్ సహా పలు ఇతర రంగాల్లో విస్తరించి ఉంది. ఇప్పుడు త్వరలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఇండియాలో కూడా ఈ సేవలు అందించనుంది. శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవల వ్యాపారంలో ఇప్పటికే ఎలాన్ మస్క్ ఉన్నారు. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ అంటే అంతరాయం లేకుండా అత్యంత వేగంగా ఇంటర్నెట్ సేవలు లభిస్తాయి. దీనికోసం లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో అమెజాన్ 3236 ఉపగ్రహాలు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో కనీసం సగం గ్రహాల్ని 2026 నాటికి నింగిలోకి ప్రవేశపెట్టాలనేది ఆమెజాన్ లక్ష్యంగా ఉంది. 

ఇప్పటికే ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ సంస్థ ఇండియాలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికే 5వేలకు పైగా ఉపగ్రహాల్ని లోయర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టింది. త్వరలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడీ రంగంలో అమెజాన్ ప్రవేశిస్తోంది. అనుమతుల కోసం భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. తక్కువ ధరకే 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందించనుంది అమెజాన్. 

శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవల ద్వారా అమెజాన్ సంస్థ దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం ఇంటర్నెట్ అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎందుకంటే ఇంటర్నెట్‌కు ఇండియా అతిపెద్ద మార్కెట్. ఇప్పటికీ ఈ రంగంలో చాలా మార్కెట్ స్పేస్ ఉంది. ఇప్పటికే భారత ప్రభుత్వం వన్‌వెబ్, జియో శాటిైలైట్స్‌కు జీఎంపీసీఎస్ అనుమతులు మంజూరు చేసింది. 

Also read: Forbes India 2023: ఫోర్బ్స్ జాబితాలో కూడా నెంబర్ వన్ కుబేరుడు అంబానీనే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News