Forbes India 2023: హారున్ ఇండియా సంపన్నుల జాబితాలో ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుుడు ప్రఖ్యాత ఫోర్బ్స్ ఇండియా జాబితాలో కూడా అతనే నెంబర్ వన్‌గా నిలిచారు. అటు గౌతమ్ అదానీ కూడా రెండవ స్థానంలో నిలిచారు.
హారున్ ఇండియా ఆసియాలో టాప్ 10 కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ముకేశ్ అంబానీ మొదటి స్థానంలో నిలవగా, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రెండవ స్థానం దక్కించుకున్నారు. ఇప్పుడు ఫోర్బ్స్ ఇండియా దేశంలో సంపన్నుల జాబితాను రిలీజ్ చేసింది. భారతదేశంలో టాప్ 100 ధనవంతుల జాబితా ఇది. ఈ జాబితాలో 92 బిలియన్ డాలర్ల నికర విలువతో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మొదటి స్థానంలో ఉన్నారు. గత ఏడాది కూడా ముకేశ్ అంబానీదే మొదటి స్థానం కావడం విశేషం.
అంతకుముందు వరకూ గౌతమ్ అదానీ మొదటి స్థానంలో ఉండగా హిండెన్‌బర్గ్ నివేదికతో ఆయన ఆస్థుల విలువ చాలా వరకూ క్షీణించింది. ఓ దశలో 36వ స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ తిరిగి కోలుకున్నారు. ఇప్పుడు 68 బిలయన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉన్నారు. ఇక సాఫ్ట్‌వేర్ దిగ్గజం శివ్ నాడార్ 29.3 బిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో నిలవగా, సావిత్రి జిందాల్ 24 బిలియన్ డాలర్లతో నాలుగవ స్థానంలో ఉన్నారు. ఇక 23 బిలియన్ డాలర్లతో రాధాకిషన్ దమానీ 5వ స్థానంలో ఉంటే..20.7 బిలియన్ డాలర్లతో సైరస్ పూణావాలా 6వ స్థానంలో ఉన్నారు. 20 బిలియన్ డాలర్లతో హిందూజా కుటుంబం ఏడవ స్థానంలో ఉంది. 19 బిలియన్ డాలర్ల నికర విలువతో దిలీఫ్ షాంఘ్వి 8వ స్థానంలో నిలిస్తే..17.5 బిలియన్ డాలర్లతో కుమార్ మంగళం బిర్లా 9వ స్థానంలో ఉన్నారు. ఇక 16.9 బిలియన్ డాలర్లతో షాపూర్ జీ మిస్త్రీ కుటుంబం పదవ స్థానంలో ఉంది.
ఫోర్బ్స్ ఇండియా సంపన్నుల జాబితా ప్రకారం దేశంలోని టాప్ 100 ధనవంతుల ఆస్థుల మొత్తం విలువ 799 బిలియన్ డాలర్లుగా ఉంది. మొన్న విడుదలైన హారున్ ఇండియా జాబితా ప్రకారం ధనవంతుల సంఖ్యతో పాటు ఆ ధనవంతుల సంపద కూడా గణనీయంగా పెరిగింది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఆస్థుల విలువ కూడా అంతే స్థాయిలో గణనీయంగా పెరిగింది.
Also read: Asia Richest Person 2023: హారున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 విడుదల, ఆసియా కుబేరుడు అంబానీనే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook