Apple iPhone 15 Price: ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్.. కలవర పెడుతున్న ఐఫోన్ 15 ధర!

iPhone 15 Price: ప్రముఖ లగ్జరీ స్మార్ట్‌ఫోన్ ఆపిల్ కొత్త సిరీస్ ఐఫోన్ 15 లాంచింగ్‌పై అప్పుడే వివిధ రకాల అంచనాలు నెలకొంటున్నాయి. ఫీచర్లు ఎలా ఉంటాయి, ధర ఎంత ఉంటుందనే వివరాల మధ్య ఆపిల్ ప్రేమికులకు ఇబ్బంది కల్గించే అంశం కూడా వెలుగుచూస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 17, 2023, 07:34 PM IST
Apple iPhone 15 Price: ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్.. కలవర పెడుతున్న ఐఫోన్ 15 ధర!

iPhone 15 Price: ఆపిల్ కొత్త సిరీస్ ఐఫోన్ 15 కోసం నిరీక్షణ నెలకొంది. సెప్టెంబర్ నెలలో లాంచ్ చేయవచ్చనేది ప్రాధమిక అంచనా. కంపెనీ అధికారికంగా వెల్లడించకపోయినా గత ఏడాది లాంచ్ డేట్ ఆధారంగా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఆపిల్ ఐఫోన్ 15 ధర ఇండియాలో పెరగనుందని తెలుస్తోంది. 

ఆపిల్ ప్రేమికులందరికీ ఐఫోన్ లాంచ్‌పై ఆసక్తి ఉంటుంది. ప్రతి యేటా ఓ మోడల్ లాంచ్ చేస్తుంటుంది. ఇప్పుడు ఈ ఏడాది సెప్టెంబర్ లాంచ్ కానున్న మోడల్ ఐఫోన్ 15. ఈసారి ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌తో పాటు ఐఫోన్ 15 ప్లస్ నెక్స్ట్ కూడా ఉండవచ్చు. అయితే ఈసారి ఎప్పటిలా కాకుండా ఇండియాలో ఐఫోన్ 15 ధరలు ఎక్కువ ఉండవచ్చని తెలుస్తోంది.

ఇదే ఇప్పుడు ఐఫోన్ ప్రేమికులకు ఆందోళన కల్గించే అంశంగా మారింది. ఐఫోన్ 15 ప్రో మోడల్స్ ధర 2 వందల డాలర్లు అధికంగా అంటే 16,490 రూపాయలు పెరగవచ్చని అంచనా ఉంది. దీని ప్రకారం ఇండియాలో ఐఫోన్ 15 ప్రో ధర 1,44,900 రూపాయలు ఉండవచ్చని తెలుస్తోంది. 

Also Read: Amazon Prime Lite: రూ.999కే అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌.. బెనిఫిట్స్ ఇవే..!

ఆపిల్ ఐఫోన్ 14 ప్రో ధర కూడా భారతీయ మార్కెట్‌లో పెరిగింది. ఎందుకు పెరిగిందనేది కారణాలు తెలియదు. ఐఫోన్ 14 ప్రో ప్రారంభధర ఇండియాలో 1,29,900 ఉంది. అదే అమెరికాలో 82,380 రూపాయలుంది. ఐఫోన్ 15 ప్రారంభధరను దీనిపై 200 డాలర్లు అధికంగా అంటే 98,850 రూపాయలు ఉండవచ్చు. ఇక దీనిపై జీఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ అన్నీ కలుపుకుంటే ఇండియాలో ఈ ధర మరింత పెరగనుంది. 

ఐఫోన్ 14 సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ఆపిల్ డేస్ ఈవెంట్ పురస్కరించుకుని ఇండియాలో తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. అసలు ధర 79,900 కాగా, అమెజాన్‌లో 67,999 రూపాయలకు లభిస్తోంది. ఇక ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభధర 89,900 కాగా ఇప్పుడు 76,900 కు పడిపోయింది. అమెజాన్ ఆపిల్ డేస్ సేల్ జూన్ 17తో ముగియనుంది. 

Also Read: Edible Oil Prices: తగ్గనున్న వంటనూనె ధరలు, 5 శాతం తగ్గిన ఇంపోర్ట్ ట్యాక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News