iPhone SE 2022 Bookings: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ ఇటీవల బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎస్ఈ 2022ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రీమియం మోడళ్లలోని ఫీచర్లతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇక ఇప్పుడు ఈ కొత్త స్మార్ట్ఫోన్ల విక్రయాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రీ బుకింక్స్, సేల్స్ వివిరాలను ప్రకటించింది.
ప్రీ బుకింగ్స్ నేటి నుంచే..
ఐఫోన్ 2022 స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్ నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. యాపిల్ అధికారిక స్టోర్‌లో (ఆన్లైన్లో) నేటి నుంచి (మార్చి 11) ఈ స్మార్ట్ఫోన్లను ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం సయంత్రం 6:30 నుంచి ప్రత్యేక విండో అందుబాటులో ఉంటుంది.
ఇక విక్రయాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయని యాపిల్ తెలిపింది. వినియోగదారులకు ఈ నెలాఖరునుంచి స్మార్ట్ఫోన్ల డెలివరీలు ప్రారంభమయ్యే వీలుంది.
ధర ఎంత?
యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 2022 ప్రారంభ ధర రూ.43,900గా (64 జీబీ వేరియంట్‌కి) ఉంది. ఇదే కాకుండా 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో కూడా ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది కంపెనీ. వీటి ధరలు వరుసగా రూ.48,900, రూ.58,900గా నిర్ణయించింది యాపిల్.
కలర్స్..
యాపిల్ ఐఫోన్ 2022 మూడు రంగుల్లో లభ్యంకానుంది. మిడ్నైట్, స్టార్‌లైట్, ప్రోడక్ట్ రెండు కలర్స్‌లో ఈ మోడల్ అందుబాటులోకి వచ్చింది.
ఐఫోన్ 2022 ఫీచర్స్..
ఐఫోన్ ఎస్ఈ 2022 ఏ15 బయోనిక్ చిప్సెట్తో అందుబాటులోకి వచ్చింది. ప్రీమియం మోడల్ అయినా ఐఫోన్ 13 కూడా ఇదే చిప్సెట్తో పని చేస్తుండటం గమనార్హం. కొత్త మోడల్ ఐఓఎస్ 15పై పని చేస్తుంది.
4.7 అంగుళాల డిస్ప్లే, ఫేస్ ఐడీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 7 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
Also read: light fares: భారీగా తగ్గనున్న విమాన ఛార్జీలు- కారణాలివే..!
Also read: Today Gold Rate 11 March 2022: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook