Asus: ఇండియన్ మార్కెట్ లోకి బాహుబలి ల్యాప్ టాప్...రిలీజ్ చేసిన ఆసుస్!

Asus: ఇండియన్ మార్కెట్లోకి బాహుబలి ల్యాప్ టాప్ ను లాంచ్ చేసింది ఆసుస్. కింద పడినా పగలకపోవడం ఈ ల్యాప్ టాప్ ప్రత్యేకత.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 22, 2021, 03:11 PM IST
  • ఇండియన్ మార్కెట్ లోకి కొత్త ల్యాప్ టాప్
  • బహుబలి ల్యాప్ టాప్ ను రిలీజ్ చేసిన ఆసుస్
  • కింద పడినా పడకపోవడం ఈ ల్యాప్ టాప్ ప్రత్యేకత
Asus: ఇండియన్ మార్కెట్ లోకి బాహుబలి ల్యాప్ టాప్...రిలీజ్ చేసిన ఆసుస్!

Asus: ఇండియా మార్కెట్ లో కొత్త ల్యాప్ టాప్ లు సందడి చేస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం డిమాండ్ పెరగడంతో...మార్కెట్లోకి ల్యాప్ టాప్ లకు డిమాండ్ పెరిగింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ కంపెనీలు అద్భుతమైన ఫీచర్లుతో మార్కెట్లోకి ల్యాప్ టాప్ లు లాంచ్ చేస్తున్నాయి. తాజాగా అంగడిలోకి మరో ల్యాప్ టాప్ను రిలీజ్ చేసింది ఆసుస్. 

ఎక్కువ మెుత్తం వెచ్చించి..కొనుగోలు చేసిన ల్యాప్‌ట్యాప్‌(Laptops)లను చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా అవి పగిలే పోయే అవకాశం ఉంది. కానీ తాజాగా మార్కెట్‌లో విడుదలైన ఆసుస్‌ బాహుబలి ల్యాప్‌ ట్యాప్‌ మాత్రం కింద పడినా పగలదు. ఇందుకోసం ప్రత్యేకమైన ఎక్విప్‌ మెంట్‌ను యాడ్‌ చేసినట్లు ఆసుస్‌(Asus) ప్రతినిధులు తెలిపారు. 
తైవాన్‌(Tiwan) ఎల్రక్టానిక్స్‌ దిగ్గజం ఆసుస్‌(Asus) తన ప్రాడక్ట్‌ల విడుదలతో ఇండియన్‌ మార్కెట్‌(Indian Market)లో సందడి చేస్తోంది. ఈ ఏడాది జులై నెలలో ఆసుస్‌ క్రోమ్‌​బుక్‌ ల్యాప్‌టాప్‌ క్రోమ్‌​బుక్‌ ఫ్లిప్ సీ214, క్రోమ్‌​బుక్‌ సీ423, క్రోమ్‌​బుక్‌ సీ523, క్రోమ్‌బుక్‌ సీ223 విడుదలతో హాట్‌ టాపిగ్గా మారింది. అయితే తాజాగా కింద పడినా డ్యామేజీ అవ్వకుండా ఉండేలా క్రోమ్​బుక్​ డిటాచబుల్​ సీజెడ్​1 (Asus Chromebook Detachable CZ1)ను రిలీజ్ చేసింది. 

Also Read: Flying Car: త్వరలో ఇండియాలో మేకిన్ ఇండియా ఫ్లైయింగ్ కారు

స్పెసిఫికేషన్స్‌ 
ఆసుస్​ క్రోమ్​బుక్​ డిటాచబుల్​ సీజెడ్​1 500 గ్రాముల బురువు ఉంటుంది. ఇంట్లో వినియోగించే డెస్క్‌, లేదంటే డైనింగ్‌ టేబుల్‌ పై నుంచి కింద పడినా పగలదు. పైగా కింద పడినా ప్రొటెక్ట్‌ చేసేలా నాలుగు వైపుల రబ్బర్‌ ట్రిమ్‌తో వస్తుందని ఆసుస్‌ ప్రతినిధులు తెలిపారు. వీటితో పాటు ​గూగుల్​ అస్టిస్టెంట్​ వాయిస్ రికగ్నయిజేషన్(Google Assistant Voice Recognition)తో  వినియోగదారుల్ని అలసరిస్తుండగా..1920x1200 పిక్సెల్స్,​10.1 ఫుల్​ హెచ్​డీ, ఎల్​సీడీ డబ్ల్యూయూఎక్స్​జీఏ టచ్​స్క్రీన్ డిస్​ప్లే, 16:10 యాస్పెక్ట్ రేషియో,100 శాతం ఎస్​ఆర్​జీబీ, 400 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్ పాటు క్రోమ్ ఓఎస్​తో వస్తోంది.     

మీడియాటెక్ కంపానియో 500 (ఎంటీ8183) ప్రాసెసర్, ఆర్మ్​ మాలి-జీ72 ఎంపీ3 జీపీయూ చిప్​సెట్ తో వస్తుండగా 4జీబీ ర్యామ్​, 128 జీబీ ఈఎంఎంసీ స్టోరేజీ చేసుకోవచ్చు. యూఎస్​బీ టైప్​-సీ పోర్టు, 3.5ఎంఎం జాక్​, 1.5ఎంఎం కీట్రావెల్ కీబోర్డు ​తో పాటు టైపింగ్​కు అనువుగా ఉండేలా ఎర్గో లిఫ్ట్​ డిజైన్​తో ఆకర్షిస్తుంది. 8 మెగాపిక్సెళ్ల రేర్​ కెమెరా , 2 మెగాపిక్సెల్​ ఫ్రంట్ కెమెరా, 15 సెకన్ల పాటు చార్జింగ్ చేస్తే 45 నిమిషాల పాటు వినియోగించుకోవచ్చు. 27డబ్ల్యూహెచ్​ఆర్ బ్యాటరీతో వస్తున్నఈ క్రోమ్​బుక్​ను 11 గంటల వరకు నిర్విరామంగా వినియోగించుకునేలా బ్యాటరీ సదుపాయం ఉన్నట్లు ఆసుస్‌(Asus) తెలిపింది. ఆసుస్​ క్రోమ్​బుక్ డిటాచబుల్​ అడ్జెస్ట్‌ మెంట్‌ కోసం స్టాండ్​ తో వస్తుండగా..ఈ మోడల్ ధర ఎంతో తెలియాల్సి ఉంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x