Kishan Reddy Slams KCR: మేము ప్రోటోకాల్ పాటించాం.. KCR కూర్చీని అందుకే తొలగించాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy on PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమం సందర్భంగా సీఎం కేసీఆర్‌కు చివరి నిమిషం వరకు కూర్చీ వేసి ఉంచామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఆయన రాకపోవడంతోనే ఆ కూర్చీ తొలగించాల్సి వచ్చిందన్నారు. తెలంగాణలో మంత్రులందరూ జీరో అంటూ విమర్శలు గుప్పించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 11, 2023, 12:32 PM IST
  • కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
  • ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన విజయవంతం
  • కొడుకును ముఖ్యమంత్రి చేయడం తప్ప కేసీఆర్‌కు మరో ఆలోచన లేదు: కిషన్ రెడ్డి
Kishan Reddy Slams KCR: మేము ప్రోటోకాల్ పాటించాం.. KCR కూర్చీని అందుకే తొలగించాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy on PM Modi Hyderabad Sucess: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన విజయవంతమైందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు లబ్ధిచేకూర్చే ప్రాజెక్టుల ప్రారంభం, భూమిపూజ జరిగిందని.. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. సంక్రాంతి కానుకగా.. సికింద్రాబాద్-విశాఖపట్టణం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని.. ఇప్పుడు సికింద్రాబాద్-తిరుపతి నగరాల మధ్య వందే భారత్‌ను ప్రారంభించడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. దేశంలో ప్రజల సౌకర్యార్థం 100 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభిస్తామని ప్రధాని ఇదివరకే చెప్పారన్న కిషన్ రెడ్డి.. ఈ విషయం తెలియక తెలంగాణ మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.

'ప్రధాని కార్యక్రమం సందర్భంగా చివరి నిమిషం వరకు ముఖ్యమంత్రి కోసం కుర్చీ వేసి పెట్టాం.. మోదీ గారు వేదికపైకి వచ్చాకే.. కేసీఆర్ రాని కారణంగా ఆ కుర్చీని తొలగించాల్సి వచ్చింది. తెలంగాణలో మంత్రులందరూ జీరో.. ప్రగతి భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను మాత్రమే చదువుతారు. అధికారిక కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడారంటూ తెలంగాణ మంత్రి తలసాని  చేసిన వ్యాఖ్యల్లో అర్థం లేదు. ఎవరిపేరు తీసుకోకుండా.. ప్రధానమంత్రి అవకాశవాద, వారసత్వ రాజకీయాల ద్వారా జరుగుతున్ననష్టాన్ని మాత్రమే ప్రజలకు గుర్తు చేశారు. గతంలో ఎర్రకోట వేదిక ద్వారా కూడా దేశంలో అవినీతిని, వారసత్వ  రాజకీయాలను దేశం నుంచి తరిమికొట్టాలని  మోదీ గారు పిలుపుఇచ్చారు..' అని కిషన్ రెడ్డి అన్నారు.

Also Read: Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించిన మోదీ.. ప్రయాణ సమయం ఎంతంటే..?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు రారని, ప్రజలను కలవరన్నారు. ఇంతకుమించి వేరే పని కేసీఆర్‌కు ఏముందో ప్రజలకు తెలపాలని  ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, భూమిపూజకు రానంత ముఖ్యమైన పని సీఎంకు ఏముందని ఆయన అడిగారు.

గతంలో రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసిన సందర్భంలోనూ ప్రధానమంత్రి  కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకాని విషయాన్నికేంద్రమంత్రి ప్రస్తావించారు. ఎన్ని కార్యక్రమాలున్నా.. తెలంగాణపై ఉన్న అభిమానంతో ప్రధాని ఇవాళ హైదరాబాద్‌కు వచ్చారన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణను ఎలా దోపిడీ చేయాలి..? కొడుకును ముఖ్యమంత్రిని ఎలా చేయాలనేదే కేసీఆర్ ఆలోచన  అని ఆయన అన్నారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన కేసీఆర్ తెలంగాన  ప్రజలకు క్షమాపణచెప్పాలని  డిమాండ్ చేశారు. ప్రధానమంత్రికి కేసీఆర్‌తో వైరం లేదని, తెలంగాణ  ప్రజలతోనే కేసీఆర్‌కు వైరం ఉందన్నారు. తాము ప్రొటోకాల్ పాటించామని.. ముఖ్యమంత్రే దాన్ని ధిక్కరించారని ఆయన అన్నారు. 

Also Read: PM Modi Speech: సీఎం కేసీఆర్ టార్గెట్‌గా ప్రధాని మోదీ ప్రసంగం.. అవినీతిపరులపై చర్యలు ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News