Bank of Baroda కొత్త కార్లు కొనాలనుకునే వాళ్లకు బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ ఆఫర్ ఇస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యాంకు ఆఫ్ బరోడా(బీఓబీ) కారు వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై కారు లోన్లకు సంబంధించిన వడ్డీ రేట్లను తగ్గిస్తున్నామని తెలిపింది. వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తాజా తగ్గింపుతో వడ్డీ రేటు 7 శాతానికి తగ్గింది. తాజా తగ్గింపుతో 7.25 శాతం నుంచి కారు వడ్డీ రేటు 7 శాతానికి దిగివచ్చింది.
వినియోగదారులు వీలైనంత త్వరగా ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని బ్యాంక్ ఆఫ్ బరోడా వినియోగదారులకు సూచిస్తోంది. ఈ ఆఫర్ కేవలం కొంత కాలం వరకే అమలులో ఉంటుందని చెప్పింది. కారు లోన్లపై తాను ప్రకటించిన వడ్డీ తగ్గింపు జూన్ 30 ,2022 వరకు మాత్రమే అమలులో ఉంటుందని చెప్పింది. కొత్త కారు కొనుక్కోవాలని భావిస్తున్నవాళ్లు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని చూచిస్తోంది. అయితే టూవీలర్ లోన్లతో పాటు సెకండ్ హ్యాండ్ కార్లు కొనే వారికి మాత్రం ఈ వడ్డీ తగ్గింపు వర్తించదని సూచించింది.
వడ్డీ రేట్లు తగ్గించి కస్టమర్లను ఆకర్శించిన బ్యాంక్ ఆఫ్ బరోడా.... లోన్ ప్రాసెసింగ్ ఫీజులను కూడా తగ్గించింది. జూన్ 30 వరకు లోన్ ప్రాసెసింగ్ ఫీజులను తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీంతో వినియోగదారులకు రూ.1,500 ఆదా అవుతాయని తెలిపింది. ఈ వడ్డీ రేట్లు వినియోగదారుల క్రెడిట్ ప్రొఫైల్‌తో లింకై ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో కస్టమర్లకు మరిన్ని సేవలు అందుతాయని తెలిపింది. వినియోగదారులను ఆకర్శించడంలో ముందు నుంచి మిగతా వాటి కంటే ముందుండే బ్యాంక్ ఆఫ్ బరోడా....ఇటీవలే హోమ్ లోన్ల పై వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో సొంతిళ్లు కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాంక్ ఆప్ బరోడా చేదోడు వాదోడుగా నిలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా 6.5 శాతం వడ్డీ రేట్లతో హోమ్ లోన్స్ లభిస్తున్నాయి. అయితే గతంలో ఈ వడ్డీ రేటు 6.75 శాతం ఉండేది. కొత్త రేటును అమలులోకి వచ్చిన తర్వాత వడ్డీ రేట్లు తగ్గాయి.
also read Whatsapp: భారతీయ యూజర్లకు వాట్సప్ షాక్, 18 లక్షల ఖాతాలు బ్యాన్, కారణమేంటి
alsor read Nissan New Model: 'డాట్సన్' నిలిపివేత.. ఇండియన్ మార్కెట్లోకి నిస్సాన్ కొత్త మోడల్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.