Car Buying Tips: కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు

Tips for Buying New Car: కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారు కచ్చితంగా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. తమ బడ్జెట్‌ను అంచనా వేసుకుని.. అంతకుమించి ఖర్చు పెట్టకుండా కారును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీరు కారు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2024, 03:02 PM IST
Car Buying Tips: కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు

Tips for Buying New Car: సొంతంగా ఓ కారు కొనుక్కోవాలని చాలామందికి ఉండే కల. కారు కొనుగోలు చేయాలని ముందు నుంచే రూపాయి రూపాయి కుడబెట్టుకుని ప్లాన్ చేసుకునే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కారును తీసుకునేముందు కాస్త జాగ్రత్త వహించండి. కారు షోరూమ్‌కు వెళ్లే ముందే అన్ని విషయాలపై అవగాహన తెలుసుకుని వెళ్లండి. మీరు ఏ కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు..? ఏ కలర్, ధర, ఆఫర్‌ గురించి తెలుసుకోండి. ఆన్‌లైన్‌లో పరిశోధన, మోటార్ షోలు, ఇప్పటికే కారు కొనుగోలు చేసిన వారితో మాట్లాడి ఎలాంటి కారు తీసుకుంటే బెటర్‌గా ఉంటుంది..? మైలేజ్ ఎలా ఉంటుంది..? వంటి విషయాలపై అవగాహన పెంచుకోండి. 

కారు ధర, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఇతర ఖర్చులను లెక్కించుకుని మీ బడ్జెట్‌ను రూపొందించుకోండి. షోరూమ్‌కు వెళ్లేముందే బడ్జెట్‌ లిమిట్‌ను సెట్ చేసుకోండి. అంతకంటే ఎక్కువ ఖర్చు చేయకుండా చూసుకోండి. ఒక కారును వేర్వేరు షోరూమ్‌లలో చెక్ చేసుకోండి. ఆఫర్లు, ధరలను సరిచూసుకోండి. కొటేషన్ తీసుకుని.. మీకు ఎక్కడ తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లతో వస్తుందో తెలుసుకోండి. మీరు కొనుగోలు చేయాలని అనుకున్న కారును టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడే పూర్తిగా చెక్ చేసుకోండి.

కారు డ్రైవింగ్ సౌకర్యం, ఫీచర్లు, పనితీరును ఎక్స్‌పీరియన్స్ చేసుకోండి. ఒక వేళ మీకు ఇప్పటికే పాత కారు ఉంటే.. షోరూమ్‌లో ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ల గురించి తెలుసుకోండి. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో మీ పాత కారుకు మంచి ధర లభిస్తుందో లేదో చెక్ చేసుకోండి. మీరు ఈఎంఐలతో కారు కొనుగోలు చేస్తున్నట్లయితే వడ్డీ రేట్లను తెలుసుకోండి. మీరు ఎంత డౌన్‌ పేమెంట్ చెల్లిస్తే.. ఇంకా ఎంత చెల్లించాలి..? వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి..? మధ్యలో లోన్ ప్రీక్లోజ్ చేయాలనుకుంటే ఛార్జీలు ఎలా ఉంటాయి..? వంటి పూర్తి వివరాలు తెలుసుకోని కారును కొనుగోలు చేయండి. 

షోరూమ్‌లో అందించే ఫైనాన్సింగ్ ఆప్షన్‌లను కూడా పరిశీలించండి. అన్ని ఫైనాన్సింగ్ వడ్డీ రేట్లు, లోన్ కాలపరిమితి, ఇతర ఛార్జీలను గురించి తెలుసుకోండి. షోరూమ్‌లో ఇతర వారంటీలు, కారుకు కావాల్సిన యాక్సరీస్ ధరలపై అవగాహనతో ఉండండి. బయట అంతకంటే తక్కువ ధరకు లభిస్తే.. షోరూమ్‌లో నిర్మోహమాటంగా వద్దని చెప్పండి. మీకు అవసరమైన వాటిని మాత్రమే తీసుకోండి. అనవసరమైన వాటిని కొనుగోలు చేయకండి.

Also Read: Viral Video today: ప్రేమ పేరుతో అమ్మాయిలే కాదు.. ఆడ సింహాలు కూడా మోసం చేస్తాయి.. ఈ వీడియో చూడండి..

Also Read: Viral News: ఇదేంది సారూ... పీకల దాక తాగి స్కూల్ కు వచ్చిన ఉపాధ్యాయుడు.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News