Senior Citizens: సీనియర్ సిటిజన్లకు శుభవార్త, కేంద్ర ప్రభుత్వం నుంచి నెలకు 5 వేల పెన్షన్

Senior Citizens: వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా పధకాలు నిర్వహిస్తోంది. వీటి ద్వారా చాలామందికి ఆర్ధిక చేయూత లభిస్తోంది. ఇప్పుడు మరో శుభవార్త విన్పించింది. సీనియర్ సిటిజన్లకు కూడా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రయోజనం చేకూర్చనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 1, 2023, 04:33 PM IST
Senior Citizens: సీనియర్ సిటిజన్లకు శుభవార్త, కేంద్ర ప్రభుత్వం నుంచి నెలకు 5 వేల పెన్షన్

కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఆర్ధికంగా ఆదుకునేందుకు కొత్త పథకం ప్రారంభిస్తోంది. ఈ పధకం ద్వారా ప్రతినెలా సీనియర్ సిటిజన్ల ఖాతాలో నేరుగా 5 వేల రూపాయలు జమ కానున్నాయి. వృద్ధాప్యం వరకూ ఈ డబ్బులు మీ ఎక్కౌంట్‌లో ప్రతి నెలా వచ్చి పడనున్నాయి. 

ప్రభుత్వం అందిస్తున్న ఈ పధకం పేరు అటల్ పెన్షన్ స్కీమ్. ఇది కేవలం సీనియర్ సిటిజన్లకే. అంటే 60 ఏళ్ల వయస్సు దాటితే అర్హులౌతారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా సీనియర్ సిటిజన్ల ఖాతాలో ప్రతి నెలా 5000 రూపాయలు పెన్షన్ అందిస్తుంది. ఈ డబ్బులు నేరుగా మీ ఖాతాల్లోకే వెళ్లనున్నాయి. వృద్ధాప్యంలో ఆర్దిక సహారా కోసం అటల్ పెన్షన్ యోజన ప్రవేశపెట్టింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుున్న ఈ పథకం వృద్ధాప్యంలో డబ్బుల కొరత రాకుండా ఉండేందుకు తలపెట్టింది. ఈ పథకంలో మీరు చిన్నమొత్తం నగదును జమ చేయవచ్చు. 

ఈ పథకంలో భాగంగా 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయస్సువారే పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుపై 60 ఏళ్ల తరువాత నెలకు కొంత డబ్బు పెన్షన్‌గా వస్తుంది. 20 లక్షల వరకూ పెట్టుబడి పెట్టడం వల్ల 60 ఏళ్ల వయస్సు దాటితే నెలకు 5 వేల రూపాయలు పెన్షన్ లభిస్తుంది. ఈ పథకంలో 60 ఏళ్ల వరకూ ప్రతి నెలా 1454 రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తరువాత ప్రతి నెలా 1000 నుంచి 5000 రూపాయలు మీకు పెన్షన్‌గా అందుతుంది. ఈ పథకం లబ్ది కోసం బ్యాంక్ లేదా పోస్టాఫీసులో ఎక్కౌంట్ ఓపెన్ చేయవచ్చు.

Also read: PPF Withdrawal process: పీపీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు ఎప్పుడు ఎలా తీసుకోవచ్చు, నిబంధనలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News