Credit Card Tips: క్రెడిట్ కార్డు ఎలా వాడాలి..? అధిక వడ్డీ నుంచి ఇలా తప్పించుకోండి

How to Use Credit Card: మీరు కూడా క్రెడిట్ వాడుతున్నారా..? బిల్లు చెల్లించలేక తీవ్ర ఇబ్బందిపడుతున్నారా..? కార్డు ఎలా వాడాలో తెలియకుందా..? క్రెడిట్ కార్డును పొదుపుగా వాడుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అదే విస్ యూజ్ చేస్తే.. బిల్లులు కట్టలేక చుక్కలు చూడాల్సి ఉంటుంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 30, 2023, 10:55 PM IST
Credit Card Tips: క్రెడిట్ కార్డు ఎలా వాడాలి..? అధిక వడ్డీ నుంచి ఇలా తప్పించుకోండి

How to Use Credit Card: ప్రస్తుతం చాలామంది క్రెడిట్ కార్డు వాడుతున్నారు. అయితే కార్డు వాడేప్పుడు ఎంత సంతోషంగా ఉంటున్నారో.. బిల్లు కట్టేప్పుడు మాత్రం రెట్టింపు బాధపడుతుంటారు. అసలు క్రెడిట్ కార్డు ఎందుకు తీసుకున్నారాం బాబు అంటూ అనేక మంది బాధపడుతుంటారు. మన చేతిలో డబ్బులేకున్నప్పుడు క్రెడిట్ ఎంతో ఉపయోగపడుతుంది. సరైన సమయంలో చెల్లిస్తే.. ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. కానీ సమయానికి చేతిలో డబ్బులు లేక క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే.. వడ్డీ మీద వడ్డీ.. చక్ర వడ్డీలు వసూలు చేస్తారు. అందుకే క్రెడిట్ కార్డును పొదుపుగా వాడుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. అది కొంచెం లెక్కతప్పి వాడితే జేబుకే చిల్లులు పెట్టుకోవాల్సిందే. క్రెడిట్ కార్డు పొదుపుగా ఎలా వాడాలో తెలుసుకోండి. 

అన్ని బ్యాంకులు క్రెడిట్‌ కార్డులను లిమిట్‌తో జారీ చేస్తాయి. ఆ లిమిట్‌లోపల మనం డబ్బులు వాడుకుంటే.. కార్డు బిల్ జనరేట్ అయిన టైమ్‌లోపు చెల్లించాలి. ఇలా ఇన్‌టైమ్‌లో చెల్లిస్తే ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన పనిలేదు. అంటే.. మనకు బ్యాంకులు ఎలాంటి వడ్డీ తీసుకోకుండానే డబ్బులు లోన్ ఇస్తున్నాయన్న మాట. కాకపోతే సమయానికి చెల్లించకపోతే మాత్రం మీకు చుక్కలు కనిపిస్తాయి. ఇన్‌టైమ్‌కు క్రెడిట్ కార్డు పేమెంట్స్‌ చేయకపోతే.. బ్యాంకులు 15 నుంచి 50 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి. 
 
క్రెడిట్ కార్డు బిల్లును డ్యూడేట్‌లోపు కట్టేస్తే.. మీ క్రెడిట్ స్కోరు కూడా పెరుగుతుంది. ఒకవేళ బిల్లు కట్టడంలో ఆలస్యమైనా.. కట్టుకుండా వదిలేసినా మీ క్రెడిట్ స్కోరుపై భారీ ప్రభావం పడుతుంది. క్రెడిట్ స్కోరు బాగుంటే లోన్లు మీకు తక్కువ వడ్డీకే లభించే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు వాడుకునే ముందు.. మీరు ఆ బిల్లును ఎప్పటిలోగా కట్టగలరో ముందే ఓ అంచనా వేసుకోవాలి. మీ దగ్గర డబ్బులు ఉండి.. క్రెడిట్ ద్వారా బిల్లులు చెల్లిస్తుంటే మీరు ఎంత ఖర్చు పెట్టారో.. అంత డబ్బును మరో బ్యాంక్‌ ఖాతాలో జమ చేసుకోండ. బిల్ జనరేట్ అయిన తరువాత ఆ ఖాతా నుంచి బిల్ కట్టేయండి.  

క్రెడిట్ సరిగ్గా వాడితే.. మీ సిబిల్ స్కోరు మెరుగవ్వడమే కాదు.. మీ బ్యాంక్ నుంచి క్రెడిట్ పాయింట్స్ కూడా వస్తాయి. ఈ క్రెడిట్ పాయింట్స్‌ను మీరు డబ్బులుగా మార్చుకోవచ్చు. అంతేకాదు చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డులపై వివిధ రకాల బీమా ప్రయోజాలను కూడా అందిస్తున్నాయి. క్రెడిట్ కార్డును మీ ఖర్చులకు తగినట్లు వాడుకుని సరైన సమయంలో బిల్లులు చెల్లిస్తే.. మీకు మంచి ఫ్రెండ్‌లా ఉంటుంది. అది బిల్లులు చెల్లించడంలో విఫలమైతే పక్కలో బల్లెంలా ఎప్పుడు పొడుస్తుంది. క్రెడిట్ కార్డును జాగ్రత్తగా వాడుకోండి. వడ్డీల భారం నుంచి తప్పించుకోండి. 

Also Read: Rohit Sharma Birthday: రోహిత్ శర్మ బర్త్‌ డేకు హైదరాబాద్ ఫ్యాన్స్ స్పెషల్ గిఫ్ట్.. 60 అడుగుల భారీ కటౌట్.. కోహ్లీని మించి..!  

Also Read: New Secretariat In Telangana: కొత్త సచివాలయం గుండెకాయ వంటిది.. చెమట చిందించిన ప్రతి శ్రామికుడికీ ధన్యవాదాలు: సీఎం కేసీఆర్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News