Croma Black Friday Sales: యాపిల్ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్ ఆఫర్లు, ఎప్పటివరకంటే

Croma Black Friday Sales: బ్లాక్ ఫ్రైడే. ఇది అమెరికాలో జరిగే యూన్యవల్ షాపింగ్ ఈవెంట్. ఇప్పుడిది ఇండియాకూ విస్తరించేసింది. అందుకే వివిధ ఉత్పత్తులపై కంపెనీలు భారీ డిస్కౌంట్ అందిస్తున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 24, 2022, 06:01 PM IST
Croma Black Friday Sales: యాపిల్ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్ ఆఫర్లు, ఎప్పటివరకంటే

నవంబర్ 25 వతేదీ బ్లాక్ ఫ్రైడే పురస్కరించుకుని వివిధ రకాల ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్ నడుస్తోంది. కొన్ని కంపెనీలు రెండ్రోజులు ముందు నుంచే ఆఫర్ అందిస్తుంటే..మరికొన్ని కంపెనీ ఆ ఒక్కరోజుకే ఆఫర్ పరిమితం చేశాయి.

అమెరికాలో ప్రతియేటా జరిగే షాపింగ్ ఈవెంట్‌ను బ్లాక్ ఫ్రైడే అంటారు. ఈ ఏడాది బ్లాక్ ఫ్రైడే నవంబర్ 25న ఉంది. ఈ సందర్భంగా భారతీయ కంపెనీలు కూడా బ్లాక్ ఫ్రైడే ఆఫర్ ప్రకటించాయి. దేశంలో అతిపెద్ద మెగా ఎలక్ట్రానిక్స్ మాల్ క్రోమా..బ్లాక్ ఫ్రైడే పురస్కరించుకుని ప్రత్యేక సేల్ ఏకంగా వారం రోజులు నడుపుతోంది. నవంబర్ 18న ప్రారంభమైన ఈ బ్లాక్ ఫ్రైడే ప్రత్యేక సేల్ నవంబర్  27 వరకూ కొనసాగనుంది. ఈ సందర్బంగా వివిధ రకాల యాపిల్ కంపెనీ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ నడుస్తోంది. 

యాపిల్ ఉత్పత్తులపై క్రోమాలో డిస్కౌంట్లు ఇలా

క్రోమాలో అన్ని రకాల కంపెనీల ఉత్పత్తులపై ఆఫర్లు ఉన్నా..యాపిల్ కంపెనీ ఉత్పత్తులపై ఆకర్షణీయంగా డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐప్యాడ్ ఎయిర్ 9వ జనరేషన్ 3 వేల రూపాయల తగ్గింపుతో 26,900 రూపాయలకు లభిస్తోంది. ఇక ఐప్యాడ్ ప్రో పై 4 వేల రూపాయల క్యాష్ బ్యాక్ అందుతుంది. ఐఫోన్ 13 లో 128 జీబీ వెర్షన్ హెచ్‌డి ఎఫ్‌సి క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే..3000 రూపాయల క్యాష్‌బ్యాక్ , ఐఫోన్ 14పై 4 వేల డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 

మరోవైపు Macbook Air 2022 పదివేల రూపాయల డిస్కౌంట్ అనంతరం 95,090 రూపాయలకు లభిస్తుంది. అదే విధంగా Macbook Pro 2022 కూడా పదివేల రూపాయల తగ్గింపుతో వస్తోంది. ఇవి కాకుండా వివిద కంపెనీల ల్యాప్‌టాప్‌లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, పోర్టబుల్ ఛార్జర్‌లు, టీడబ్ల్యూఎస్ ఇయర్‌ఫోన్‌లపై కూడా ప్రత్యేక డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

Also read: Banks Minimum Balance: మినిమమ్ బ్యాలెన్స్, జరిమానాల సమస్య ఇక లేనట్టేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News