Gold Rate: బంగారం ధర దీపావళి నాటికి రూ. 80 వేలు తాకే అవకాశం..కారణాలు ఇవే

Diwali 2024 gold and silver price prediction: బంగారం ధరలు అతి త్వరలోనే రూ.80 వేల వరకూ పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి కారణం అమెరికాలో సెప్టెంబర్ నెలలో  ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బంగారం పెరుగుదలపై ఒక్క సారిగా అంచనాలు వెలువడుతున్నాయి.  

Written by - Bhoomi | Last Updated : Aug 17, 2024, 09:52 AM IST
Gold Rate: బంగారం ధర దీపావళి నాటికి రూ. 80 వేలు తాకే అవకాశం..కారణాలు ఇవే

Diwali 2024 gold and silver price prediction: బంగారం ధరలు దీపావళి నాటికి భారీగా పెరిగే అవకాశం ఉందని బులియన్ పండితులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా పసిడి ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న మార్కెట్ పరిస్థితులే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా బంగారం ధరలు పెరగుదలకు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ ధరల పెంపునకు ప్రత్యక్ష సంబంధం ఉందని చెబుతున్నారు. సెప్టెంబర్ లో జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక భేటీలో వడ్డీ రేట్లు పావు శాతం వరకు తగ్గించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగినట్లయితే, బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన మంద్యంలోకి ప్రవేశించే అవకాశం ఉందనే వార్తలు ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ లో జరిగే ఫెడరల్ రిజర్వ్ భేటీలో కీలక వడ్డీ రేట్లు అర శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇదే కనుక జరిగినట్లయితే బంగారం మార్కెట్లో విపరీతమైన ధరల పెరుగుదల తప్పదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే అమెరికా ఆర్థిక మాంద్యం నేపథ్యంలో చైనా, జపాన్ వంటి సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. ఈ నేపథ్యంలో పసిడి ధరలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగి దీపావళి నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,000 దాటిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read : Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర..ఒక్క రోజులోనే రూ. 250 వరకూ పతనం..శనివారం ధరలు ఇవే

సాధారణంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచినట్లయితే, బంగారం ధరలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఎందుకంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ జారీ చేసే ట్రెజరీ బాండ్లను కొనుగోలు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుంటారు. ఎందుకంటే తమ పెట్టుబడులపై స్థిరమైన ఆదాయం అందించే అమెరికా బాండ్ మార్కెట్ రాబడి ఎక్కువగా ఉంటుందని అందుకే తమ పెట్టుబడులను బంగారం నుంచి బాండ్ మార్కెట్లోకి ప్రవేశపెడతారు.  అదే సమయంలో కీలక వడ్డీ రేట్లను  తగ్గించినప్పుడు మాత్రం బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.  ఎందుకంటే సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించే బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా మక్కువ చూపిస్తారు. 

 ఇక ఈ సంవత్సరం అమెరికా ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశిస్తుందని వార్తలు  యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి.  ఈ నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగేందుకు సిద్ధమవుతున్నాయి.  ఇప్పటికే బంగారం ధరలు 72,000 సమీపంలో ఉండగా.  త్వరలోనే 75,000 మార్కును తాకుతుందని  బులియన్ పండితులు విశ్లేషిస్తున్నారు.  ట్రెండ్ ఇలాగే కొనసాగినట్లయితే బంగారం ధర త్వరలోనే  రాబోయే దీపావళి నాటికి 80,000 రూపాయలు  తాకడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.  దీనికి తగ్గట్టుగానే ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా  సూచనలు లభిస్తున్నాయి.

Also Read : Bad Cholesterol Level: ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా చేస్తే.. నెల రోజుల్లో కొలెస్ట్రాల్ మంచులా కరిగిపోతుంది

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News