Nirav Modi అస్తవ్యస్థ వ్యాపార విధానాలతో తాను నష్టపోవడంతో పాటు తనకు రుణాలు ఇచ్చిన బ్యాంకులను సైతం మోసం చేసి చివరకు దేశం విడిచిపారిపోయిన నీరవ్ మోడీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలు కొనసాగుతున్నాయి. నీరవ్ మోడీ దేశం విడిచి పారిపోయిన చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడు ఆయన అస్తులను ఈడీ వేలం వేస్తోంది. ముంబైలోని వర్లీలోని సముద్ర మహల్‌లో నీరవ్ మోదీకి చెందిన మూడు ఫ్లాట్లను ఈడీ వేలం వేసింది. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.110 కోట్ల వరకు ఉంది. వీటితో పాటుగా నీరవ్‌మోడీకి చెందిన అలీబాగ్ బంగ్లా, బ్రీచ్ క్యాండీ ఫ్లాట్, సోలార్ పవర్ ప్రాజెక్ట్, విండ్‌మిల్ తో సహా అనేక ఆస్తులకు ఈడీ వేలం నిర్వహిస్తోంది. ఈ అమ్మకాలం ద్వారా రూ.6500 కోట్లు రికవరీ చేసేందుకు ఈడీ ఏర్పాట్లు చేస్తోంది. వీటి కంటే ముందు నీరవ్ మోడీ ఆర్ట్ సేకరణ, పెయింటింగ్‌లు, వాహనాలు, గడియారాలు అమ్మి ఈడీతో పాటు ఆదాయపు పన్నుశాఖ ఇప్పటివరకు 130 కోట్లు రికవరీ చేసింది.
ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక ఆధారంగా నీరవ్ మోదీకి చెందిన రెండు గడియారాలను 1.8 ఈడీ కోట్లకు విక్రయించింది. ఒక గడియారం 90.5 లక్షలకు, మరో వాచ్ 89.5 లక్షలకు అమ్ముడైనట్లు సమాచారం. ఇక లగ్జరీ వస్తువుల అమ్మకాల ద్వారా మరో రూ.2.71 కోట్ల రికవరీ చేసింది. డెస్మండ్ లాజారో పెయింటింగ్ 22.38 లక్షలకు విక్రయించింది. లేడీ హ్యాండ్ బ్యాగ్ 12.91 లక్షలకు, మరో బ్యాగ్ 11.09 లక్షలకు అమ్ముడైనట్లు సమాచారం. మరోవైపు నీరవ్ మోదీ కుటుంబ సభ్యులకు చెందిన 4400 కోట్ల విలువైన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. దీని ద్వారా మోదీ ఆస్థిలోంచి రూ.1400 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్థులు ఈడీకి దక్కగా...రూ.1000 కోట్ల విలువైన ఆస్తిని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు దక్కింది. ఇందులో నేపియన్ సీ ఫ్లాట్, రిథమ్ హౌస్, కుర్లాలోని భవనాలతో పాటు కోట్లాది రూపాయల విలున చేసే ఆభరణాలు కూడా ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు నికిలీ పత్రాలు సమర్పించి నీరవ్ మోదీ ఏకంగా వేల కోట్ల రుణం తీసుకొని ఎగ్గొట్టాడు. కొంత మంది బ్యాంకు ఉన్నతాధికారులు కమిషన్ల కోసం మోదీకి సహరించినట్లు తెలుస్తోంది. అయితే మొత్తం మీద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సాయంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎంతో కొంత నష్టాల లోంచి బయటపడుతోంది.
also read Jiomart Express: క్విక్ కామర్స్..డెలివరీ సేవల్లో జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్, గంటన్నరలోనే డెలివరీ
also read EPF Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు నిరాశ, ఈపీఎఫ్ వడ్డీరేటులో భారీగా కోత, 8.10 శాతం మాత్రమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook